Tuesday, March 3, 2026
Homeకెరీర్ న్యూస్Recruitment | సెంట్రల్ బ్యాంకు లో స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు..

Recruitment | సెంట్రల్ బ్యాంకు లో స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు..

  • నోటిఫికేషన్ విడుదల చేసిన బ్యాంకు అధికారులు..

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెగ్యులర్‌ ప్రాతిపదికన దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ శాఖల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్‌ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 275 సాఫ్ట్‌వేర్ డెవలపర్, మొబైల్ డెవలపర్, డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, నెట్‌వర్క్ సెక్యూరిటీ, డేటా ఆర్కిటెక్ట్‌, డేటా సైంటిస్ట్, ఐటీ ఆఫీసర్‌, రిస్క్ మేనేజర్ వంటి తదితర ఐటీ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు బీఈ లేదా బీటెక్‌ లేదా ఎంసీఏ అర్హత కలిగిన అభ్యర్థులు ఎవరైనా ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోండి..

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఎలక్ట్రానిక్స్ వంటి సంబంధిత విభాగంలో బీఈ లేదా బీటెక్‌ లేదా ఎంసీఏలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా పోస్టును బట్టి 2 నుంచి పదేళ్ల వరకు సంబంధిత పని అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి పోస్టును అనుసరించి 30 ఏళ్ల నుంచి 45 ఏళ్ల వరక ఉండాలి. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో మార్చి 23, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

- Advertisement -

దరఖాస్తు రుసుము కింద జనరల్ అభ్యర్ధులు రూ.850, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్ధులు రూ.175 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. ఆన్‌లైన రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.48,480 నుంచి రూ.1,20,940 వరకు జీతంగా చెల్లిస్తారు. ఆన్‌లైన్ రాత పరీక్ష తేదీ ఏప్రిల్‌ 2026 నెలలో ఉంటుంది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News