- జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.
జిల్లాలో కారుణ్య నియామకల ద్వారా పోస్టులు భర్తీ చేసినట్లు జిల్లా కలెక్టర్ అభిలాష శనివారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో గత మూడు సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న 29 కారుణ్య నియామకాల సంబంధించి 20 నియామకాలను పూర్తి చేసినట్లు వివరించారు. 20 పోస్టులలో..
13 జూనియర్ అసిస్టెంట్ 6 ఆఫీస్ సబార్డినేట్, 1 కామాటి పోస్టును భర్తీ చేశామని అన్నారు. వీరిని వివిధ శాఖలకు కేటాయించినట్లు పేర్కొన్నారు. మిగతా 9 పోస్టులు రోస్టర్ అంశాలతో ముడిపడి ఉన్నందున ఆ పోస్టులను త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపారు. కారుణ్య నియామకాలు అన్ని నియమ నిబంధనలు పాటిస్తూ, కౌన్సిలింగ్ నిర్వహించి, పారదర్శకంగా పూర్తి చేశామని కలెక్టర్ ఆ ప్రకటన ద్వారా తెలిపారు.
- Advertisement -
