Thursday, February 26, 2026
Homeఅంతర్జాతీయంEpstein | జెఫ్రీ ఎప్ స్టీన్ ఫైల్స్ కు చిక్కిన హాకింగ్..

Epstein | జెఫ్రీ ఎప్ స్టీన్ ఫైల్స్ కు చిక్కిన హాకింగ్..

  • బికినీ ధరించిన ఇద్దరు అమ్మాయిలతో ఉన్న ఫోటోలు వెలుగులోకి..

మోటార్ న్యూరాన్ వ్యాధితో బాధ‌ప‌డుతూ.. వీల్ చైర్ నుంచే విశ్వ‌ర‌హ‌స్యాల‌ను చేధించిన స్టీఫెన్ హాకింగ్ కూడా జెఫ్రీ ఎప్‌స్టీన్ ఫైల్స్‌కు చిక్కారు. బ్రిటీష్ ఖ‌గోళ శాస్త్ర‌వేత్త హాకింగ్‌.. బికినీ ధ‌రించిన ఇద్ద‌రు అమ్మాయిలతో ఉన్న ఫోటోను తాజాగా రిలీజ్ చేశారు. ఆ ఫోటోను ఎప్‌స్టీన్ ఫైల్స్ నుంచి బ‌య‌ట‌కు తీసిన‌ట్లు తెలిసింది.

సెయింట్ థామ‌స్‌లోని రిట్జ్ కార్ల‌ట‌న్ హోటల్‌లో జ‌రిగిన సైన్స్ స‌ద‌స్సు స‌మ‌యంలో 2006లో ఆ ఫోటో తీసిన‌ట్లు అంచ‌నా వేస్తున్నారు. సూర్య‌ర‌శ్మి కోసం సేద‌తీరే కుర్చీపై వాలిన హాకింగ్ చేతిలో కాక్‌టెయిల్ ఉన్న‌ది. హాకింగ్ ద‌గ్గ‌ర అటూ ఇటూ నిలుచున్న ఇద్ద‌రు అమ్మాయిలు బికిని దుస్తుల్లో ఉన్నారు. ఆ ఇద్ద‌రు కూడా కాక్‌టెయిల్ ప‌ట్టుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News