Tuesday, February 24, 2026
Homeకెరీర్ న్యూస్TG Ed.CET 2026 | టీజీ సెట్ ఎడ్ సెట్ - 2026 షెడ్యూలు విడుదల..

TG Ed.CET 2026 | టీజీ సెట్ ఎడ్ సెట్ – 2026 షెడ్యూలు విడుదల..

  • ఏప్రిల్ 15 వరకు దరఖాస్తుల స్వీకరణ..

టీజీ ఎడ్‌సెట్‌-2026 షెడ్యూల్‌ను కాకతీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో సోమవారం విడుదల చేశారు. టీజీ ఎడ్‌సెట్‌- 2026 చైర్మన్‌, కేయూ వైస్‌ చాన్సలర్‌ ప్రతాప్‌రెడ్డి, కన్వీనర్‌ వెంకట్రామిరెడ్డి టీజీ ఎడ్‌సెట్‌-2026 అధికారిక వెబ్‌సైట్‌ను ఆవిషరించారు. ఈ నెల 23 నుంచి ఏప్రిల్‌ 15 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. మే 2 నుంచి దరఖాస్తుల్లో మార్పులు, చేర్పులు, మే 4న పరీక్ష కేంద్రాల కేటాయింపు చేయనున్నారు. హాల్‌ టికెట్లు మే 9 నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ప్రవేశ పరీక్ష మే 12న ఉదయం 10 గంటలకు, మధ్యాహ్నం 2 గంటలకు రెండు సెషన్లలో నిర్వహిస్తారు. మే 15న ప్రాథమిక కీ విడుదల, మే 17 వరకు అభ్యంతరాల స్వీకరణ, మే 30న తుది ఫలితాలు ప్రకటిస్తారు. 16 నగరాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News