విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న విద్యాశాఖ.. రకరకాల పేర్లతో తల్లిదండ్రులను మభ్యపెడుతున్న నారాయణ విద్యాసంస్థ.. గడచిన రెండేళ్లుగా ఎలాంటి అనుమతులు లేకుండా నడుస్తున్న స్కూల్స్..
- విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న విద్యాశాఖ..
- రకరకాల పేర్లతో తల్లిదండ్రులను మభ్యపెడుతున్న నారాయణ విద్యాసంస్థ…
- గడచిన రెండేళ్లుగా ఎలాంటి అనుమతులు లేకుండా నడుస్తున్న స్కూల్స్..
- ప్రభుత్వ ఖజానాకు లక్షల్లో ఎగనామం..
- ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోకుండానే పాఠశాలల నిర్వహణ..
- లంచాల మత్తులో జోగుతున్న తెలంగాణ విద్యా శాఖ..
- స్కూళ్ళు నడుపుతున్న భూములు గురుకుల ట్రస్ట్ వివాదంలో ఉండటం కొసమెరుపు.
- ముఖ్యమంత్రి దృష్టి సారించాలని కోరుతున్న విశ్లేషకులు..
పాఠశాలంటే విద్యార్థులను తీర్చిదిద్ది భవిష్యత్ మేధావులుగా తయారుచేసే దేవాలయాల వంటివి.. అలాంటి దేవాలయాలను వ్యాపార సంస్థలుగా తయారు చేస్తున్నారు కొందరు నయవంచకులు.. ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమతులు లేకుండా.. గురుకుల ట్రస్ట్ వివాదంలో ఉన్న భూముల్లో రకరకాల పేర్లతో విద్యాలయాలు నడుపుతూ.. వేలల్లో ఫీజులు వసూలు చేస్తూ.. ప్రభుత్వాన్ని సైతం తప్పుదోవపట్టిస్తున్నారు.. హైదరాబాద్లోని మాదాపూర్, అయ్యప్ప సొసైటీలో నిర్భయంగా, నిస్సిగ్గుగా నారాయణ విద్యా సంస్థలు పాఠశాలలను నడుపుతున్న వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది..

తెలంగాణ రాష్ట్రంలో మరీ ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలో ప్రైవేట్ విద్యాసంస్థల దోపిడీ అప్రతిహతంగా సాగిపోతోంది.. వారికి ఎలాంటి అనుమతులు, గుర్తింపులు లేవు.. పాఠశాలలు నిర్వహిస్తున్న భవన భద్రత ప్రమాణాలపై తీవ్ర సందేహాలు సైతం వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోతోంది ప్రముఖ విద్యాసంస్థ అయిన నారాయణ గురించి.. సదరు నారాయణ స్కూల్స్ మాదాపూర్ లోని అయ్యప్ప సొసైటీ, చందా నాయక్ తండ, సిద్ధి వినాయక నగర్ పరిధిలో రక రకాల పేర్లతో స్కూల్స్ నిర్వహిస్తూ తల్లి దండ్రులను మభ్యపెడుతూ.. నారాయణ వారాహి క్యాంపస్ అంటూ సుమారు ఐదు రకాల పాఠశాలను అక్రమంగా నడుపుతున్నారు..
వీరు స్కూల్స్ నడుపుతున్న స్థలం గురుకుల ట్రస్ట్ వివాదంలో ఉండటం, ప్రభుత్వ నిషేధం ఉన్నప్పటికీ.. దుర్మార్గంగా, కొందరు విద్యాశాఖ అధికారుల అండతో నిర్వహిస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.. మరీ దారుణం ఏమిటంటే ఇప్పటికే ఆ భూములు గురుకుల ట్రస్ట్ వివాదంలో ఉన్నాయి.. మండల విద్యాశాఖ అధికారులకు, జిల్లా విద్యాశాఖ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించు కోవడం లేదు. దీనికి కారణం లంచాలు తీసుకుని మిన్నకుండిపోతున్నారనే విమర్శలు సైతం వినిపిస్తున్నాయి..

ఈ పాఠశాలలు అన్ని అనుమతులు చట్టబద్ధంగా పొందబడ్డాయా? పొందితే ఫిర్యాదుపై సమాధానం ఏది..? ఫైర్ సేఫ్టీ, బిల్డింగ్ సేఫ్టీ, విద్యాశాఖ గుర్తింపులు సక్రమంగా ఉన్నాయా? నిజంగా జిల్లా అధికారులు తనిఖీలు చేస్తున్నారా..? అలా కాకుండా కేవలం పేపర్లవరకే పరిమితం అవుతోందా..?
రంగారెడ్డి జిల్లా పరిథిలో విద్యాశాఖ అధికారుల మౌనం పలు అనుమానాలకు తావిస్తోంది.. ఈ మౌనం వెనుక రాజకీయ ప్రమేయం ఏమైనా ..? అన్న అనుమానాలు సైతం వెల్లువెత్తుతున్నాయి.. కాగా స్థానిక ఎం.ఈ.ఓ. 12 ఫిబ్రవరి 2026 నాడు ఆర్.సి. నెంబర్ : 549/2/ఎస్.ఎల్.పీ./ఆర్.టి.ఐ./2025 ద్వారా సదరు పాఠశాలకు నోటీసులు జారీ చేశారు.. ఇప్పటికి రోజులు గడుస్తున్న.. స్కూల్ యధావిధిగా నడుస్తుండటం పలు అనుమానాలకు తావిస్తోంది.. 579 ఈ వ్యవహారంపై ప్రజావాణిలో సైతం ఫిర్యాదు చేయడం జరిగింది.. కాగా ఈ ఆదేశాలను అమలు కాకుండా ఆపుతున్న శక్తి ఏమిటి అన్నది జవాబులేని ప్రశ్నగా మారింది..
మొన్నటికి మొన్న విద్యాశాఖలో ఓ అధికారి రూ. 70,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సంఘటన చూశాం.. అదేవిధంగా నారాయణ స్కూల్స్ కు సంబంధించిన ఫైల్స్ ను బయటకి రాకుండా తొక్కిపెట్టడానికి కొందరు అధికారులు లంచాలు తీసుకుంటున్నారనే అనుమానాలు వ్యక్తం అవు తున్నాయి.. కాగా సాక్షాత్తూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యా శాఖను నిర్వహిస్తున్నారు.. అయితే ఇలాంటి క్రిమినల్ వ్యవహారాలు ఆయన దృష్టికి రావడం లేదా..? కిందిస్థాయి అధికారులు ఈ వ్యవహారాలు బయటకు రాకుండా తమకు తోచినంత నొక్కుతూ..

జేబులు నింపుకుంటున్నారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.. ఇటు తల్లిదండ్రులను పీడిస్తూ.. అటు ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండి కొడుతూ కొందరు అవినీతి అధికారులు పబ్బం గడుపుతున్నారని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.. ఇప్పటికైనా ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి అయిన రేవంత్ రెడ్డి దృష్టిసారించి, నారాయణ విద్యా సంస్థ చేస్తున్న అరాచకాలను అరికట్టాలని పలువురు కోరుతున్నారు.. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించకపోతే ప్రజల్లో అవిశ్వాసం పెరుగుతుంది. విద్యార్థుల భవిష్యత్తుతో రాజకీయం చేయడం న్యాయం కాదని విశ్లేషకులు కోరుతున్నారు..
నారాయణ సీఓ స్కూల్ అని సరికొత్తగా తెరపైకి ది ఒన్ స్కూల్ వచ్చింది. ఈ స్కూల్ కి ఎలాంటి అనుమతులు లేకుండానే నడుపుతున్నట్లు తెలుస్తోంది.. కాగా ఈ వ్యవహారంపై కొందరు సామాజికవేత్తలు ఫిర్యాదు చేయడంతో రంగారెడ్డి జిల్లా, శేరిలింగంపల్లి, ఎంఈఓ వెంటనే సదరు స్కూల్ 2 మూసివేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు..
కానీ ఆదేశాలను ఖాతరు చేయకుండా పాఠశాలను నడుపుతున్నారు.. మరీ విచిత్రమైన విషయం ఏమిటంటే ధి వన్ స్కూల్ కి రాష్ట్ర ప్రభుత్వ అనుమతులు లేవు.. కానీ సీబీఎస్ ప్లస్ ఐబీ కరికులం అంటూ జనాలను మోసం చేస్తూ కోట్ల రూపాయలు ఫీజుల రూపంలో, డొనేషన్ల రూపంలో కొట్టీయడానికి ప్రయత్నం చేస్తున్నారు నారాయణ యానమాన్యం.. దీనితో భవిష్యత్తులో సామాన్యులను విద్యకు దూరం చేసే కుట్ర జరుగుతోందని సామాజిక వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు..
అసలు నారాయణ యాజమాన్యాన్ని టచ్ చేసే దమ్ము ఈ ప్రభుత్వానికి గానీ, ప్రభుత్వ అధికా రులకు గానీ లేదా..? నారాయణ యాజమాన్యం డోంట్ కేర్ అంటూ ముందుకు సాగుతుంటే చూస్తూ ఊరుకోవడం విద్యాశాఖకు మచ్చతెచ్చే విషయం.. అంతే కాకుండా ఎలాంటి అను మతులు లేకుండా నడుపుతున్న ఈ స్కూల్ లో 2026-27 సంవత్సరానికి గాను అడ్మిషన్లు కూడా జరుపుతున్నట్లు తెలుస్తోంది.. మరి ఉన్నతా ధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదు..?
డబ్బుకు లొంగిపోయారా..? నారాయణ యాజ మాన్యానికి భయపడుతున్నారా..? అన్ని ఆధారాలతో కథనాలు రాస్తున్నా, ఫిర్యాదులు చేస్తున్నా.. స్కూల్ ని సీజ్ చేయకుండా ఎందుకు చోద్యం చూస్తున్నారు..? పిల్లల భవిష్యత్తుతో ఆటలాడుకుంటున్న నారాయణ విద్యాసంస్థలపై, ముఖ్యమంత్రి ఖచ్చితంగా దృష్టి సారించాల్సిన సమయం ఆసన్నమైంది.. కాగా విద్యా వ్యవస్థపై వెల్లువెత్తుతున్న అనుమానాలను ప్రభుత్వమే నివృత్తి చేయాల్సిన అవసరం ఉందని సామాజిక వేత్తలు సూచిస్తున్నారు..
