- అరుదైన కళాకారుడికి అభినందనలు : వనస్థలిపురం ఇన్స్పెక్టర్ మహేశ్
‘తెలంగాణ సంస్కృతిలో అరుదైన కళగా పేరొందిన 12 మెట్ల కిన్నెర గానాన్ని ప్రపంచానికి చాటిన గొప్ప కళాకారుడు పద్మశ్రీ దర్శనం మొగులయ్య’ అని వనస్థలిపురం పోలీస్ ఇన్స్పెక్టర్ టి. మహేశ్ అన్నారు. అంతరించి పోతున్న కళను తన ప్రదర్శనల ద్వారా వెలుగులోకి తెచ్చిన మొగులయ్యకు ఇటీవల చెన్నైలోని ‘గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ’ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది.
ఈ నేపథ్యంలో శుక్రవారం వనస్థలిపురం పీఎస్‌కు వచ్చి ఇన్స్పెక్టర్ మహేశ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. సీఐ మొగులయ్యను శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు. కళారంగంలో వారి కృషి రాష్ట్రానికి , దేశానికి గౌరవాన్ని తీసుకువచ్చిందని ఇన్స్పెక్టర్ టి. మహేశ్ ప్రశంసించారు.
- Advertisement -
