- ప్రశంసా పత్రాలు అందజేసిన నల్గొండ జిల్లా ఎస్పీ
ఈనెల 9వ తారీఖున గుర్రంపోడు మండలం జూనుతల స్టేజి వద్ద కారు అదుపుతప్పి చెట్టుకు ఢీకొట్టడం జరిగింది ..ఈ ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందుకున్న గుర్రంపోడు 108 అంబులెన్స్ సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకొని గాయపడిన క్షతగాత్రులను అంబులెన్స్ లో తీసుకుని వారికి అవసరమైన ప్రథమ చికిత్స చేసుకుంటూ క్షేమంగా దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో అడ్మిట్ చేయడం జరిగింది.
గాయపడిన క్షతగాత్రుడి వద్దనున్న 1,50,000 రూపాయలను క్షతగాత్రుని యొక్క బంధువులకు అందజేయడం జరిగింది. ఇట్టి విషయంలో నిజాయితీగా చాటుకున్న గుర్రంపోడు 108 సిబ్బంది EMT. సత్యనారాయణ, PILOT. వెంకటేశ్వర్లు లను అనగా 20.2.2026 శుక్రవారం* రోజున నల్గొండ పోలీస్ కేంద్ర కార్యాలయంలో నల్గొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవర్ అభినందించి ప్రశంసా పత్రాలను అందజేయడం జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇక ముందు కూడా ఇలాగే నిజాయితీగా నిస్వార్ధంగా పేద ప్రజలకు సేవలు అందించాలని మరియు అన్ని డిపార్ట్మెంట్లలో కూడా ఇదే విధంగా నిజాయితీగా ఉండాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా 108 ప్రోగ్రాం మేనేజర్ షేక్ సలీం, 108 సిబ్బంది పాల్గొన్నారు.
