- శివాజీ మహారాజ్ పోరాటం యువతకు మార్గదర్శకం:డాక్టర్ సామల హేమ
ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా సికింద్రాబాద్ పరిధిలోని వారసిగూడ,పార్సీగుట్ట ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన శివాజీ మహారాజ్ విగ్రహాలను తాజా మాజీ కార్పొరేటర్ డాక్టర్ సామల హేమ సందర్శించి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ,శివాజీ మహారాజ్ దేశభక్తి,ధైర్యసాహసాలు,ప్రజాస్వామ్య పరిరక్షణలో చేసిన సేవలు యువతకు ఎప్పటికీ మార్గదర్శకమని పేర్కొన్నారు.
ప్రజల సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని ఆయన అమలు చేసిన పాలన నేటికీ ఆదర్శంగా నిలిచిందని అన్నారు.సమాజంలో న్యాయం,సమానత్వం,సాంస్కృతిక గౌరవం కోసం శివాజీ మహారాజ్ చేసిన పోరాటం ప్రతి భారతీయునికి స్ఫూర్తిదాయకమని తెలిపారు.ప్రస్తుత తరానికి ఆయన ఆశయాలను పరిచయం చేసి,దేశాభివృద్ధి దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు శైలేందర్,మల్లూరి అనిల్ కుమార్,కృష్ణ ముదిరాజ్, సాగర్,బాబూరావు,లక్ష్మి,లలిత,సుజాత తదితరులు పాల్గొన్నారు.
