- రెండు నెలల్లో దాదాపు పది ఆక్సిడెంట్లు.
- చోద్యం చూస్తున్న అధికారులు.
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మామునూర్ కేంద్రంగా వరంగల్- ఖమ్మం హైవే పై ఇటీవల ఏర్పాటుచేసిన డివైడర్ల వలన ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరుగుతుందని దీనిపై అధికారులు చోద్యం చూస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడైనా కానీ రోడ్డు వెడల్పు చేసిన తర్వాత డివైడర్లను ఏర్పాటు చేసి అప్ అండ్ డౌన్ వానదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తారని, కానీ ఇక్కడ రోడ్డు వెడల్పు చేయకుండానే ఏర్పాటుచేసిన డివైడర్ల వలన గతంలో కంటే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని, దాదాపు గత రెండు నెలల కాలంలో 10 వరకు యాక్సిడెంట్లు జరిగాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

డివైడర్లు ఏర్పాటు చేసినట్లుగా సూచికలు కూడా పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయనందున వాహనదారులు డివైడర్లను గుర్తించలేకపోతున్నారని, దీనివలన ప్రాణ ఆస్తి నష్టం జరుగుతున్నాయని, తక్షణమే కనీసం డివైడర్ల ముందు 50 మీటర్ల వరకు ఇరువైపులా ఫైబర్ డివైడర్లను ఏర్పాటు చేసి ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు.
