16-02-2026 నాడు సాయంత్రం సుమారు 08:15 గంటల సమయంలో పనామా సమీపంలోని డైమండ్ వైన్స్ బెల్ట్ షాపు దగ్గర దెంది కార్తీక్ రెడ్డి,S/o.లింగ రెడ్డి,వయస్సు:27 సంవత్సరాలు,వృత్తి:ప్రైవేట్ ఉద్యోగి,R/o:ప్రశాంత్ నగర్,వనస్థలిపురం నందు ఉండే వ్యక్తి బాగా మధ్యం త్రాగి diamond wines నందు వేరే వారితో గొడవ పడుతూ పబ్లిక్ న్యూసెన్స్ చేస్తున్నాడని అని డయల్-100 కాల్ వస్తే పెట్రోలింగ్ సిబ్బంది అతనిని పోలీసు స్టేషన్ కి తీసుకోరావడం జరిగింది.
అయితే దెంది కార్తీక్ రెడ్డి అనే వ్యక్తి పోలీసు స్టేషన్ తీసుకోవచ్చినప్పటి నుండి అక్కడికి వచ్చిన పబ్లిక్ ని, అక్కడ డ్యూటి చేస్తున్న సిబ్బందిని ఇష్టం వచ్చినట్లు తిడుతూ న్యూసెన్స్ చేసినాడు, ఎందుకు ఎలా చేస్తున్నావని పోలీసు స్టేషన్ నందు వాచ్ డ్యూటి ఉన్న యాదగిరి కానిస్టేబుల్ అడిగితే, సదరు కార్తీక్ రెడ్డి అకస్మాత్తుగా తన తలతో కానిస్టేబుల్ తలపై బలంగా గుద్దినాడు, దాంతో సదరు కానిస్టేబుల్ తలకి బలమైన రక్తగాయం అయినది.
దాంతో కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు, డ్యూటిలో ఉన్న కానిస్టేబుల్ యొక్క విధులను ఆటంకపరిచి అతని పై దాడి చేసిన వ్యక్తి అయిన దెంది కార్తీక్ రెడ్డి,S/o:లింగ రెడ్డి మీద SHO-వనస్థలిపురం గారు కేసు నమోదు చేసినారు. అలాగే వైన్స్ లో జరిగిన గొడవలో కొట్టినందుకు కిరణ్ ఫిర్యాదు మేరకు కార్తీక్ రెడ్డి, మరికొంత మంది పై కేసు చేసినారు. కార్తిక్ రెడ్డి ని ఈ రోజు రిమాండ్ చేయడం జరిగింది, గౌరవ జడ్జి గారు అతనిని చెర్లపల్లి జైలుకి రిమాండ్ కి పంపారు.
