Tuesday, February 17, 2026
Homeక్రైమ్ వార్తలుDharmagiri Temple | ఇదో రకం షోషల్ మీడియా పిచ్చి..

Dharmagiri Temple | ఇదో రకం షోషల్ మీడియా పిచ్చి..

  • శివుడికి ప్రసాదంగా గంజాయిని పెట్టిన యువకులు..
  • షోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో..
  • సీరియస్ గా తీసుకున్న సీపీ సజ్జనార్..

ఆధ్యాత్మికతకు నెలవైన దేవాలయాలు నేడు సోషల్ మీడియా పిచ్చికి అడ్డాగా మారుతున్నాయి. మహాశివరాత్రి పర్వదినం వేళ శంషాబాద్ లోని ధర్మగిరి దేవాలయంలో కొందరు యువకులు చేసిన పని ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. భక్తులంతా భక్తిశ్రద్ధలతో కొబ్బరికాయలు, పూలు సమర్పిస్తుంటే, ఈ ప్రబుద్ధులు మాత్రం సాక్షాత్తు ఆ పరమశివుడికి ‘గంజాయి’ని ప్రసాదంగా పెట్టి తమ వికృత చేష్టలను ప్రదర్శించారు.

బడంగ్ పేటకు చెందిన చరణ్, అతని స్నేహితులు శివరాత్రి సందర్భంగా ధర్మగిరి ఆలయానికి చేరుకున్నారు. అందరూ చేసేలా కాకుండా తాము ఏదో వెరైటీగా చేస్తున్నామనే భ్రమలో గంజాయిని దేవుడి పాదాల చెంత ఉంచి వీడియో తీశారు. “దేవుడికి అందరూ కొబ్బరికాయలు కొడతారు.. మేము మాత్రం గంజాయి ప్రసాదం పెడుతున్నాం” అంటూ ఆ వీడియోలో వ్యాఖ్యానించారు. అనంతరం ఆ వీడియోను ‘ఇన్స్టాగ్రామ్’లో రీల్స్ గా పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్ గా మారింది.

- Advertisement -

ఈ వీడియోపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దేవుడిని, భక్తుల మనోభావాలను కించపరిచేలా వ్యవహరించిన సదరు యువకులపై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ కు సోషల్ మీడియా వేదికగా ఫిర్యాదులు చేశారు. దీనిపై తక్షణమే స్పందించిన సీపీ సజ్జనార్, నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు సిబ్బందిని ఆదేశించారు.

వీడియో ఆధారంగా నిందితులు బడంగ్ పేటకు చెందిన వారిగా పోలీసులు ఇప్పటికే గుర్తించారు. ఈ సందర్భంగా సీపీ సజ్జనార్ మాట్లాడుతూ.. కేవలం వ్యూస్ కోసం, లైక్స్ కోసం మతపరమైన విశ్వాసాలను దెబ్బతీస్తూ ఇలాంటి రీల్స్ చేసే వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని హెచ్చరించారు. “సోషల్ మీడియాను విజ్ఞానానికి, వినోదానికి వాడాలి తప్ప, ఇలాంటి వికృత చేష్టలకు కాదు. పవిత్రమైన దేవాలయాల్లో ఇలాంటి పనులకు పాల్పడితే కఠినమైన చట్టపరమైన చర్యలు తప్పవు” అని ఆయన స్పష్టం చేశారు..

- Advertisement -
RELATED ARTICLES

Latest News