Monday, February 16, 2026
Homeబిజినెస్Stock Market | భారీ లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్..

Stock Market | భారీ లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్..

  • బ్యాంకింగ్ స్టాల్స్ లో జోరుగా కొనుగోళ్లు..
  • బంగారం ఔన్స్ 5,033 డాలర్ల వద్ద ట్రేండింగ్..

దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు ఇవాళ భారీ లాభాలతో ముగిశాయి. బ్యాంకింగ్‌ స్టాక్స్‌లో జోరుగా కొనుగోళ్లు జరగడం సూచీలకు కలిసొచ్చింది. దాంతో గత రెండు రోజుల వరుస నష్టాలకు బ్రేక్‌ పడింది. ఉదయం 82,480.40 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమైన బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ సూచీ సెక్సెక్స్‌.. క్రమంగా కోలుకుని లాభాలబాట పట్టింది.

చివరికి సెన్సెక్స్‌ 650 పాయింట్ల లాభంతో 83,277.15 వద్ద ముగియగా.. నిఫ్టీ 211.65 పాయింట్ల లాభంతో 25,682.75 వద్ద స్థిరపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 90.66గా ఉంది. సెన్సెక్స్‌ 30 సూచీలో పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఎన్టీపీసీ, ఐటీసీ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి.

- Advertisement -

టెక్‌ మహీంద్రా, మారుతీ సుజుకీ, బజాజ్‌ ఫైనాన్స్‌, ట్రెంట్, మహీంద్రా అండ్‌ మహీంద్రా షేర్లు నష్టపోయాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్‌ బ్యారెల్‌ 67.44 డాలర్ల వద్ద కొనసాగుతుండగా.. బంగారం ఔన్సు 5,033 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News