Monday, February 16, 2026
Homeమెదక్‌Sarpanch | అతిగా హామీలు… నెరవేరని వాగ్దానాలు

Sarpanch | అతిగా హామీలు… నెరవేరని వాగ్దానాలు

  • నయా సర్పంచులకు కష్టకాలం షురూ
  • గ్రామాల్లో విమర్శల పర్వాలు స్టార్ట్
  • ఆదాయమే లేదు… అభివృద్ధి ఎలా..?
  • గ్రామాల్లో సమస్యల తిష్ట
  • తలలు పట్టుకుంటున్న కొత్త సర్పంచులు

నయా సర్పంచులకు గ్రామంలో సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. లక్షల రూపాయలు ఖర్చుపెట్టి ఎన్నికల్లో గెలిస్తే ఇదేంట్రా బాబు పరిస్థితి గిట్లాయే అంటూ తలలు పట్టుకుంటున్నారు. ఖర్చులు కొండంత ఆదాయం మాత్రం సున్న అన్న సామెతలు గుర్తు చేస్తూ గ్రామాల్లో పంచాయతీ ఖజానా దర్శనమిస్తుంది. దీనికి తోడు ఎన్నికల సమయంలో తాము నెగ్గేందుకు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం గుద్ది బండగా మారింది. దీంతో గ్రామాల్లో ప్రజల నుండి అప్పుడే ప్రజల నుండి విమర్శల పర్వాలు మొదలయ్యాయి.

అప్పుడు హామీలు ఇచ్చాం… ఇప్పుడు ఎలా నెరవేర్చాలో అనే అయోమయంలో నయా సర్పంచులు ఉన్నారు. ఇదిలా ఉండగా ఎన్నికల్లో నెగ్గడానికి సర్పంచులు అప్పులు చేసి మరి లక్షల్లో ఖర్చు పెట్టారు నెగ్గాక ఏమి చేయాలో తెలియక గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేయాలో గ్రామ ప్రజలకు ఇచ్చిన హామీల ప్రశ్నిస్తే ఏమిచెప్పాలి అనే అయోమయంలో నయా సర్పంచ్ లు పడ్డారు. గ్రామానికి ఏమన్నా చేద్దామన్న గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గజ్వేల్ నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అనేక రకాల సదుపాయాలు కలగజేశారు.

- Advertisement -

అందులో భాగంగా ప్రజలకు ఇక్కడ… అక్కడ అని కాకుండా గల్లీ.. గల్లీ వరకు ప్రజలకు కాలు బయట పెడితే కాలికి మట్టి తగలకుండా రోడ్ల నిర్మాణం చేపట్టారు, మహిళలకు ఇబ్బందులు కలగకుండా మహిళా భవనాలు, గ్రామ పంచాయతీ లేని గ్రామాల వద్ద నూతన గ్రామ పంచాయతీలు, గ్రామ ప్రజలకు నీటి సమస్య ఉండకూడదని మిషన్ భగీరథ పథకం, గ్రామాల్లో డంపింగ్ యార్డ్, పార్కులు, రైతులకు ఇబ్బందుకు కలుగకుండా మల్లన్న సాగర్,కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు ప్రవేశ పెట్టీ గ్రామాలను సస్య శ్యామలంగా తీర్చిదిద్దారు. నూతనంగా ఎన్నికైన సర్పంచుల ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి వీరికి ఎలాంటి కొత్త పథకాలు ప్రవేశపెడతారోనని గ్రామాలకు కొత్త సర్పంచులు ఏమి చేస్తారోనని గ్రామస్తులు ఎదురుచూస్తున్నారు.

ఇది ఇలా ఉంటే ఎన్నికల సమయంలో గెలుపొందడానికి కరపత్రాల ద్వారా ఇళ్లు, ఇల్లు తిరిగి మమ్మల్ని గెలిపిస్తే గ్రామానికి మేం.. ఇది చేస్తాం.. అది చేస్తాం అని హామీలను ఇచ్చారు.ఇచ్చిన హామీలు ఎలా నెరవేరుస్తారో అని మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఇదిలా ఉంటే గెలిచిన అభ్యర్ధులకు గెలిచామన్న ఆనందం కన్నా ఇచ్చిన హామీలను ఎలా నెరవేర్చాలనీ తలలు పట్టుకుంటే సర్పంచు అభ్యర్ధులు గా పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్ధులు మాత్రం గ్రామాల్లో చాలా స్వేచ్ఛ గా, హ్యాపీగా, ఆనందంగా, ఖుషీ.. ఖుషీ గా ఉండడం గ్రామాల్లో కనిపిస్తుంది.మాకు మాత్రం ఎలాంటి బాధ లేదు అని ఫీలవుతున్నారు.

గెలిస్తే అన్నీ గత ప్రభుత్వ హయాంలోనే మాజీ ముఖ్యమంత్రి గ్రామ ప్రజలకు అన్నీ అభివృద్ధి పనులు జరిగాయని గెలిచి చేసే పనులేమున్నాయని చర్చించుకుంటున్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలోని గజ్వేల్ ముఖ చిత్రాన్ని మార్చేశాడని గజ్వేల్ లో ఇక చేయడానికి పెద్దగా ఏమీ లేదనీ ఓడిన బాధ తప్ప మరేమీలేదు . రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇస్తుందా లేదా అనే అటువంటి ఆలోచనలో నూతనంగా గెలుపొందిన సర్పంచులు గజ్వేల్ నియోజకవర్గంలో పెద్దమొత్తంలో బిఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేసిన అభ్యర్ధులు సర్పంచులు గా గెలుపొందడం విశేషం.

ఇది ఇలా ఉండగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు చేపట్టి రెండు సంవత్సరలు గడిచి నప్పటికీ గజ్వేల్ నియోజకవర్గనికి ఇప్పటివరకు ఎలాంటి అభివృద్ధి నోచుకోలేదనీ మేధావి వర్గాలు చెబుతున్నాయి. మొత్తం మీద గ్రామాల్లో మాత్రం హామీలు అలా… నెరవేర్చడం ఎలా… అనేటువంటి ఆలోచనతోటి నూతనంగా గెలిచినటువంటి సర్పంచులు తలలు పట్టుకుంటున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News