- ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల పూర్తి సమాచారం
ఎన్నికల గణాంకాలు (మొత్తం స్థానాలు)తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం సమాచారం ప్రకారం, ఫిబ్రవరి 11న మొత్తం 123 పురపాలక సంస్థలకు ఎన్నికలు జరిగాయి.
మొత్తం వార్డులు: 2,996..
మున్సిపల్ కార్పొరేషన్లు: 7 (మొత్తం వార్డులు: 414)
మున్సిపాలిటీలు: 116 (మొత్తం వార్డులు: 2,582)
పార్టీల వారీగా ఫలితాలు :
అధికారిక ఫలితాల ప్రకారం పార్టీల బలాబలాలు ఇలా ఉన్నాయి:
పార్టీగెలిచిన/లీడింగ్ లో ఉన్న వార్డులు (మొత్తం) కాంగ్రెస్ (INC)1,411
బీఆర్ఎస్ (BRS)725
బీజేపీ (BJP)263
ఎంఐఎం (AIMIM) 48
సీపీఎం (CPM)11
ఇతరులు/స్వతంత్రులు160+
ముఖ్యాంశాలు :
కాంగ్రెస్ హవా :
రాష్ట్రవ్యాప్తంగా అధికార కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యతలో ఉంది. ముఖ్యంగా నల్గొండ కార్పొరేషన్ ను కాంగ్రెస్ కైవసం చేసుకుంది
(48 వార్డుల్లో 27 గెలిచింది).
కార్పొరేషన్ల పరిస్థితి :
ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం 7 కార్పొరేషన్లలో మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ ముందంజలో ఉండగా, నిజామాబాద్ వంటి చోట్ల బీజేపీ గట్టి పోటీనిస్తోంది. కొత్తగూడెంలో సీపీఐ బలమైన ఉనికిని చాటుకుంది.
మున్సిపాలిటీలు : మెజార్టీ మున్సిపాలిటీలలో కాంగ్రెస్ తన పట్టు సాధించింది.
వికారాబాద్, నాగర్ కర్నూల్ వంటి జిల్లాల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ దిశగా సాగుతోంది..
