Friday, February 13, 2026
HomeతెలంగాణComplaint | నల్గొండ డిఎస్పీ ని సస్పెండ్ చేయాలి..

Complaint | నల్గొండ డిఎస్పీ ని సస్పెండ్ చేయాలి..

  • తెలంగాణ రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదుచేసిన బీజేపీ నాయకులు..
  • బీజేపీ నల్గొండ జిల్లా అధ్యక్షుడిపై డీఎస్పీ దౌర్జన్యం..

నల్లగొండ జిల్లా బిజెపి జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి నల్లగొండ కార్పొరేషన్ లో 10వ వార్డ్‌లో జరిగిన ఎన్నికల అక్రమాల గురించి డిఎస్పి కి ఫిర్యాదు చేసేందుకు వెళ్లినప్పుడు, జిల్లా డిఎస్పి శివరామి రెడ్డి ఒక రౌడీలా ప్రవర్తించి ఆయనపై దాడి చేయడం జరిగింది.. దుర్భాషలాడి కొట్టడం వంటి ఘోర ఘటన జరిగింది.

ఈ ఘటనపై ఆయన డాక్టర్ కళ్యాణ్ నాయక్ ఆధ్వర్యంలో తెలంగాణ బిజెపి నాయకులు డీజీపీ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా కొన్ని డిమాండ్లు చేశారు.. నల్లగొండ జిల్లా డిఎస్పి శివరామిరెడ్డిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలి.. దాడిపై సమగ్ర విచారణ జరిపి అరెస్ట్ చర్యలు చేపట్టాలి.. ఎన్నికల అక్రమాలను రద్దు చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలి.. దీనిపై స్పందించిన డీజీపీ శవదార్ రెడ్డి సమగ్ర విచారణ జరిపి న్యాయపరమైన చర్యలు వెంటనే చేపడతామని హామీ ఇచ్చారు..

- Advertisement -
RELATED ARTICLES

Latest News