Wednesday, February 11, 2026
Homeరంగారెడ్డిNo VIP Pass | కీసరగుట్ట జాతరకు విఐపి పాసులు లేనట్టే..

No VIP Pass | కీసరగుట్ట జాతరకు విఐపి పాసులు లేనట్టే..

కీసరగుట్ట బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈసారి వాహనాలకు ఎలాంటి విఐపి పాసులు ఇవ్వడం లేదని డీసీపీ శ్రీధర్ తెలిపారు. స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. జాతరకు వచ్చే భక్తులు తమ వాహనాలను పార్కింగ్‌లో నిలుపుకొని, అక్కడినుండి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనాలలో క్యూ లైన్ల వరకు చేరుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఈవో సుధాకర్ రెడ్డి, చైర్మన్ వెంకటేశ్ శర్మ, సీఐ ఆంజనేయులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News