Tuesday, February 10, 2026
Homeరంగారెడ్డిRajaka Sangam | రజక సంఘం అధ్యక్షులుగా చిలుకూరి యాదగిరి.

Rajaka Sangam | రజక సంఘం అధ్యక్షులుగా చిలుకూరి యాదగిరి.

రజక సంఘం నందిగామ గ్రామ కమిటీ అధ్యక్షులుగా చిలుకూరి యాదగిరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నందిగామ మండల కేంద్రంలో సోమవారం గౌరవ అధ్యక్షులు ఆర్ యాదగిరి,మాజీ అధ్యక్షులు చాకలి బాలరాజ్ ల ఆధ్వర్యంలో నిర్వహించిన రజక సంఘం నాయకుల సమావేశంలో నూతన గ్రామ కమిటీని ఎన్నుకున్నారు.గ్రామ అధ్యక్షులుగా చిలుకూరి యాదగిరి, ఉపాధ్యక్షులుగా బొర్ర ఆంజనేయులు,ప్రధాన కార్యదర్శిగా చింతలపల్లి రాంబాబు, కార్యదర్శిలుగా సి.వీరయ్య, సి.శివాజీ, సి. సిద్దులు,సలహాదారులు సి.రమేష్, సి.యాదయ్య,కోశాధికారి సి. చందులను ఎన్నుకున్నారు.

ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సంఘం అభివృద్ధి కోసం,సభ్యులను ఏకతాటిపైకి తెచ్చి అహర్నిశలు కృషి చేయాలని పలు సూచనలు, సలహాలను అందించారు.అధ్యక్షులు యాదగిరి మాట్లాడుతూ నాపై నమ్మకంతో ఎన్నుకున్న సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.అనంతరం నూతన కార్యవర్గాన్ని శాలువలతో సన్మానం చేసి అభినందించారు.ఈ కార్యక్రమంలో యాదయ్య,విశ్వనాథ్,నరసింహ,చెన్నయ్య,రవి,యాదయ్య,నాగయ్య,వినయ్,లింగం,నరసింహ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News