ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్న చండ్ర చంద్రశేఖర్
- చెరుకుపల్లి గ్రామ పరిధిలో లే అవుట్.. అనుమతి నిల్.. అమ్మకాలు ఫుల్..
- విచిత్రమైన వేషాలు వేస్తూ.. అమాయక ప్రజలకు శఠగోపం..
- పోలీస్ యూనిఫామ్ వేసుకొని కొనుగోలుదారులకు బురిడి..
- భూ భారతీ సైట్లో నేటికి ఇనాం భూమిగా చూపిస్తున్న వైనం..
- నాలా కన్వర్షన్ లేకుండా వ్యవసాయ భూమిగా చూపిస్తున్న రికార్డు..
- పంచాయతీ రాజ్ చట్టం 2018లోని జీ.ఓ. 67, 113 లోని రూల్స్ బేఖాతరు..
- 10 శాతం గ్రీన్ ల్యాండ్ 15 శాతం మార్టీగేజ్ జాడెక్కడ..?
- గత గ్రామ పంచాయతీ కార్యదర్శి ముడుపులు తీసుకున్నాడా..?
- రంగారెడ్డి జిల్లా డీపీవో చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న స్థానిక ప్రజలు
అద్భుతమైన టైటిళ్లు పెడతాడు.. ఆకర్షించే వేషాలు వేస్తాడు.. అడ్డగోలుగా ముంచేస్తాడు.. ఆయనే చండ్ర చంద్రశేఖర్.. ఇప్పుడు ఆయన వేసిన లే అవుట్ కూడా ఆసక్తికరంగా మారింది.. అదే సర్గసీమ సుకేతన లే అవుట్.. స్వర్గసీమ అంటే అందరికీ తెలుసు.. అలాగే సుకేతన అంతే శుభిక్షం.. కానీ ఇక్కడ ప్లాట్లు కొంటే స్వర్గం కాదు నరకమే.. అలాగే శుభిక్షం మాట దేవుడెరుగు దుర్భిక్షం మాత్రం తప్పదు.. కొందుర్గు మండలం, చెరుకుపల్లి గ్రామ శివారులో స్వరసీమ సుకేతన పేరుతో నిబంధనలకు విరుద్ధంగా వెలుస్తున్న లే అవుట్ లో ప్లాట్లు కొన్నారా అంతే సంగతులు..

రంగారెడ్డి జిల్లా, కొందుర్గు మండలం, చెరుకుపల్లి గ్రామ శివారులో స్వర్గసీమ సుకేతన పేరుతో పంచాయతీరాజ్ చట్టం 2018 నిబంధనలు తుంగలో తొక్కి అక్రమ లేఔట్ వెలిసింది.. జీఓ నెంబర్ 67 ప్రకారం అనుమతి పొందకుండా పంచాయతీరాజ్ చట్టం సెక్షన్ 113 నిబంధనలు ఉల్లంఘించి చండ్ర చంద్రశేఖర్ అడ్డదారిలో నడుస్తున్నాడని ఈ పంచాయతీ వెబ్ సైట్ లోని రికార్డులు స్పష్టం చేస్తున్నాయి.. ఈ పంచాయతీ వెబ్ సైట్ లో లే అవుట్ అనుమతి కోసం చేసుకున్న దరఖాస్తు నెంబర్ 1875 ఆన్ లైన్ లో చూస్తే గ్రామ పంచాయతీ నుండి, డీటీసీపీ నుండి ఎలాంటి అనుమతి లేదని స్పష్టం అవుతోంది..

స్వర్గసీమ సుకేతన పేరుతో భారీ భూస్కాం చేస్తూ ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ అడ్డదారులు ఎంచుకున్న చండ్ర చంద్రశేఖర్ అక్రమాలే ఇందుకు నిదర్శనం అని చెప్పుకోవచ్చు.. రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్న ఈ వెంచర్ లో అక్రమాలను పరిశీలిస్తే అన్నీ ఇన్నీ కావు. ‘స్వర్గసీమ సుకేతన’ పేరుతో చేపట్టిన లేఅవుట్ ప్రాజెక్ట్ వెనుక భారీ మోసాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.. చెరుకుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఈ ప్రాజెక్ట్ కొనసాగుతున్నప్పటికీ, గ్రామ పంచాయతీ నుంచి లేఅవుట్ అనుమతులు లేకపోయినా ప్లాట్ల అమ్మకాలు మాత్రం జోరుగా సాగుతున్నాయి.

ప్లాట్ల అమ్మకాల్లో సైతం ప్రభుత్వ ఖజానాకు భారీ గండి కొడుతున్నాడు చండ్ర చంద్రశేఖర్.. అడ్డదారిలో సంపాదించే కాసుల కోసం కస్టమర్లకు అమ్ముతున్న రేటు ఒకటైతే రిజిస్ట్రేషన్ లో చూపించే రేటు మరొకటి.. ఐటీ శాఖకు కట్టాల్సిన ట్యాక్స్ కూడా కట్టకుండా ఆ డబ్బులు దారి మళ్లించుకొని తన ఖాతాలో వేసుకుంటున్నాడని తాను చేస్తున్న ప్రచారమే అందుకు నిదర్శనం.. ఇతగాడు అమాయక ప్రజలను ఆకర్షించేందుకు విచిత్రమైన వేషాలు వేస్తూ.. ముఖ్యంగా పోలీస్ యూనిఫామ్ ధరించి కొనుగోలు దారులను నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి..

భూ భారతి వెబ్సైట్లో చండ్ర చంద్రశేఖర్ చెప్పిన భూమి వివరాలను పరిశీలిస్తే, ఈ భూములు ఇప్పటికీ ఇనాం భూములుగా, నాలా కన్వర్షన్ లేకుండా వ్యవసాయ భూములుగానే నమోదు అయి ఉన్నట్టు తెలుస్తోంది.. అలాంటి భూములను లేఅవుట్లుగా మార్చి ప్లాట్ల పేరుతో విక్రయించడం చట్ట విరుద్ధం అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి..ఇక పంచాయతీ రాజ్ చట్టం 201852 జి.ఓ.ఎం.ఎస్ నెంబర్ 6752 113 నిబంధనలను బహిరంగంగానే ఉల్లంఘించి నట్టు ఆరోపణలు ఉన్నాయి..
లేఅవుటు తప్పనిసరిగా ఉండాల్సిన 10 శాతం గ్రీన్ ల్యాండ్, 15 శాతం మార్టీగేజ్ జాడ కూడా కనిపించక పోవడంతో పంచాయతీ కార్యదర్శిపై అనేక అనుమానా లకు తావిస్తోంది. ముడుపులు తీసుకొని అక్రమంగా చేస్తున్న ఈ వెంచర్ వైపు కన్నెత్తి చూడటం లేదన్న విమర్శలు స్థానికంగా జోరుగా వినిపిస్తున్నాయి..
ఈ భూస్కాంపై, గ్రామ పంచాయతీ కార్యదర్శి అక్రమాలపై గ్రీన్ ల్యాండ్, గ్రామ పంచాయతీ మార్టిగేజి వ్యవహారంపై రంగారెడ్డి జిల్లా పంచాయతీ అధికారి సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని చెరుకుపల్లి గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.. లేకపోతే వందల మంది అమాయకులు మోసపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.. రంగారెడ్డి జిల్లా పంచాయతీ అధికారి స్పందించి పంచాయతీ చట్టం సెక్షన్ 268 ప్రకారం చర్యలు తీసుకోవాలని పలువురు సామాజిక వేత్తలు డిమాండ్ చేస్తున్నారు.
ఈ వ్యవహారంపై చెరుకుపల్లి గ్రామ సర్పంచ్ యాదయ్యను వివరణ కోరగా.. 2018 పంచాయితీరాజ్ చట్టం నిబంధనలకు లోబడి అనుమతి తీసుకున్నాడా..? పది శాతం గ్రామ పంచాయితీకి గ్రీన్ ల్యాండ్ ఇచ్చాడా..? లేదా..? 15 శాతం మార్టిగేజ్ చేసి చట్టబద్ధంగానే లే అవుట్ చేశాడా..? ఇనాం భూమికి, వ్యవసాయ భూమికి లే అవుట్ అనుమతి ఇవ్వడానికి లేదు.. ఖచ్చితంగా నాలా కన్వర్షన్ చేసుకున్న తరువాతే అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.. చట్ట వ్యతిరేకంగా అనుమతి పొంది మోసాలకు పాల్పడినట్లైతే పంచాయితీరాజ్ చట్టంలోని నిబంధనల ప్రకారం గ్రామపాలక వర్గం తరఫున చర్యలు తీసుకుంటామని వెల్లడించారు..
