Thursday, February 26, 2026
HomeజాతీయంMeghalaya | ప్రాణాలు కోల్పోయిన 16మంది కూలీలు

Meghalaya | ప్రాణాలు కోల్పోయిన 16మంది కూలీలు

  • మేఘాలయ బొగ్గుగనిలో భారీ పేలుడు..
  • తవ్వకాలు చేపడుతున్న సమయంలో ప్రమాదం..
  • ఎక్కువమంది అసోంకు చెందినవారే..
  • కొనసాగుతున్న సహాయక చర్యలు..
  • ప్రమాదంపై ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతి..
  • మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ. 50 వేలు సాయం..

ఓ బొగ్గు గనిలో పేలుడు సంభవించడంతో 16 మంది కూలీలు ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటన మేఘాలయలో గురువారం చోటుచేసుకుంది.. తూర్పు జైంతియా హిల్స్ జిల్లాలో ໙໖໐໖.. పోలీసులు వెల్లడించిన కథనాల ప్రకారం.. గనిలో బొగ్గు తవ్వకాలు చేపడుతోన్న సమయంలో ఈ పేలుడు జరిగింది. దాంతో కూలీలు అందులో చిక్కుకుపోయారు. వారిలో ఎక్కువమంది అస్సాంకు చెందినవారిగా తెలుస్తోంది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

ఈ గనిని అక్రమంగా నిర్వహిస్తున్నట్లు అనుమానాలు ఉన్నాయి. అయితే పేలుడుకు గల కారణాలు మాత్రం తెలియాల్సి ఉంది. మేఘాలయలో ర్యాట్తోల్ మైనింగ్, అశాస్త్రీయ పద్ధతుల్లో తవ్వకాలను 2014లోనే జాతీయ హరిత ట్రిబ్యునల్ నిషేధించింది. సమాంతరంగా సన్నని గుంతలు తవ్వుతూ బొగ్గును బయటకు తీసే పద్ధతినే ర్యాట్ హోల్ మైనింగ్ వ్యవహరిస్తారు. ఇలా నేలలో ఇరుకైన గుంతలను తవ్వడాన్నే ర్యాట్ హోల్గా పేర్కొంటారు.

- Advertisement -

సుమారు నాలుగు అడుగుల వెడల్పుతో మాత్రమే ఉంటుంది. కేవలం ఒక్క మనిషి మాత్రమే వెళ్లగలడు. కాగా.. ఎన్సీటీ నిషేధాన్ని సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. ప్రమాదంపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు.. క్షతగాత్రులకు రూ.50 వేలు సాయం ప్రకటించారు..

- Advertisement -
RELATED ARTICLES

Latest News