యాదగిరిగుట్ట పట్టణంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్ మాట్లాడుతూ.. యాదగిరిగుట్ట మున్సిపాలిటీలోని 10వ వార్డుతో పాటు మిగతా 11 వార్డులను కూడా సమగ్రంగా అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని అన్నారు.
ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సహకారంతో ప్రజల నమ్మకానికి తగ్గట్టుగా పట్టణ అభివృద్ధికి కృషి చేస్తామని స్పష్టం చేశారు.. ఈ సందర్భంగా గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్ కు శాలువా కప్పి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు యాదగిరిగుట్ట పట్టణంలోని అన్ని వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతో విజయం సాధించి, చైర్మన్‌గా పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని ఆయన ఆకాంక్షించారు.
