Tuesday, February 10, 2026
Homeఎన్‌.ఆర్‌.ఐRevanth | అమెరికాలో.. 6 రోజులు విద్యార్థిగా..

Revanth | అమెరికాలో.. 6 రోజులు విద్యార్థిగా..

తెలంగాణ రాష్ట్ర సీఎం(Telangana State CM) రేవంత్ రెడ్డి(Revanth Reddy) అమెరికా(America)లో 6 రోజులు విద్యార్థి(Student)గా గడిపిన అరుదైన క్షణాలను సామాజిక మాధ్యమం వేదికగా ఆనందంగా పంచుకున్నారు. ప్రతిష్టాత్మక హార్వర్డ్ కెన్నెడీ స్కూల్(Harvard @ Kennedy School)లో ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ పూర్తిచేశానని చెప్పారు. 21వ శతాబ్దంలో నాయకత్వం అనే అంశంపై పాఠాలు విన్నానని తెలిపారు. 20 దేశాల నుంచి 60 మందికిపైగా విద్యార్థులు ఉన్న తరగతిలో గొప్ప ఉపాధ్యాయులు, అధ్యాపకుల నుంచి మాత్రమే కాకుండా తోటి విద్యార్థుల నుంచి కూడా ఎన్నో విలువైన విషయాలను నేర్చుకున్నానని పేర్కొన్నారు. ఇదంతా భయంకరమైన మంచు తుఫాను నేపథ్యంలో జరిగిందని వెల్లడించారు. ఘనీభవన స్థానం కన్నా తక్కువ ఉష్ణోగ్రతల మధ్య, 3 అడుగుల కన్నా ఎత్తైన హిమపాతం, చలి గాలులతో కూడిన అననుకూల వాతావరణంలో క్లాసులకు వెళ్లానని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల్లో చదువుతున్న అద్భుతమైన, విజయవంతమైన వ్యక్తులను కలిశానని వివరించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News