ఏపీలో వైఎస్‌ఆర్‌సీపీ నేత(Ysrcp Leader) అంబటి రాంబాబు(Ambati Rambabu)పై శనివారం పోలీస్ కేసు(Police Case) నమోదైంది. ఆయన సీఎం చంద్రబాబు(CM Chandrababu)ను అసభ్య పదజాలం(vulgar language)తో తిట్టారని తెలుగుదేశం పార్టీ నేతలు(Telugu Desam Party Leaders) ఆరోపించారు. దీనిపై గుంటూరు జిల్లా పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. టీడీపీ కార్యకర్తలు ఆగ్రహంతో అంబటి రాంబాబు ఇంటి మీద రాళ్లు రువ్వారు. దీంతో నవభారతనగర్‌లోని ఆయన నివాసం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో పోలీసులను మోహరించారు. అంబటి ఇంటి వద్ద తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. ఆయన బేషరతుగా చంద్రబాబుకు క్షమాపణ చెప్పాలని మంత్రి పార్థసారథి డిమాండ్ చేశారు. అంబటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. అవి శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్నాయని మండిపడ్డారు. వైఎస్‌ఆర్‌సీపీ రాజకీయ పార్టీనా అసాంఘిక శక్తులకు అడ్డానా అని టీడీపీ నేత వర్ల రామయ్య ప్రశ్నించారు. అంబటి చరిత్ర అందరికీ తెలిసిందేనని ఎద్దేవా చేశారు. సభ్య సమాజం సిగ్గుపడేలా ఆయన చంద్రబాబుపై నోరు పారేసుకున్నారని ఆగ్రహం వెలిబుచ్చారు.
Ambati | అంబటి రాంబాబుపై కేసు
- Advertisement -
RELATED ARTICLES
