మంత్రి వివేక్(Minister Vivek) గురువారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కోటపల్లి మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ నిర్వహించిన పురాణం రామకృష్ణయ్య స్మారకార్థ క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులను అందజేశారు. అనంతరం.. వేరే కార్యక్రమంలో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం (Brs Party Government) ధరణి(Dharani)తో తెచ్చిన భూతగాదాలను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ప్రజాపాలనలో తెచ్చిన భూభారతితో పరిష్కరిస్తున్నామని చెప్పారు. చెన్నూరు మండలం అక్కేపల్లి గ్రామంలో సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. నిన్న మేడారం జంపన్న వాగులో స్నానానికి వెళ్లి మృతి చెందిన భీమారం మండలంవాసి శ్రీనివాస్ యాదవ్ కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబాన్ని ప్రభుత్వపరంగా ఆదుకుంటామని భరోసా కల్పించారు.
Vivek | పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి వివేక్
By Aadab Desk
- Advertisement -
Previous article
Next article
