Wednesday, February 11, 2026
Homeరంగారెడ్డిమున్సిపల్ ఎన్నికల వేళ కాంగ్రెస్, బీజేపీ లకు భారీ షాక్

మున్సిపల్ ఎన్నికల వేళ కాంగ్రెస్, బీజేపీ లకు భారీ షాక్

  • ఎమ్మెల్యే మల్లారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ లో భారీ చేరికలు

మున్సిపల్ ఎన్నికల వేల కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు భారీ షాక్ తగిలింది. మేడ్చల్ నియోజకవర్గం ఎల్లంపేట్ మున్సిపాలిటీ పరిధిలో ని సోమారం గ్రామనికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ సర్పంచ్ కరుణకర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ వెంకటేష్, సీహెచ్. రమేష్, మాజీ ఉప సర్పంచ్ బలరాం, మాజీ వార్డ్ సభ్యులు ఆర్. కృష్ణ చంద్ర శేఖర్, అశోక్, బీజేపీ పార్టీ నుండి బీజేవైఎం వైస్ ప్రెసిడెంట్ చిర్ల యాదగిరి ముదిరాజ్, యాదగిరి, బాలేష్, శ్రీనివాస్ లతో పాటు 20 మంది కార్యకర్తలు మల్లారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. వీరికి ఎమ్మెల్యే పార్టీ కండువాలు వేసి బీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ మహేందర్ రెడ్డి, మాజీ గ్రంధాలయ మాజీ ఛైర్మన్ భాస్కర్ యాదవ్, మేడ్చల్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దయానంద్ యాదవ్, మద్దుల శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News