- మాజీ ఎంపీపీ బిజెపి సీనియర్ నాయకులు వాసాల రమేష్ డిమాండ్
కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని కొత్తపల్లి స్టేజి వద్ద ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సులను ఆపకుండా వెళ్లడంతో కొత్తపల్లి ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తక్షణమే ఎక్స్ప్రెస్ బస్సులను కొత్తపల్లి స్టేజి వద్ద నిలిపే విధంగా ఆదేశాలు ఇవ్వాలని మాజీ ఎంపీపీ బిజెపి సీనియర్ నాయకుడు వాసాల రమేష్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తపల్లి ప్రజల సమస్య గతంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు విన్నవించగా స్పందించిన మంత్రి ఆర్టీసీ అధికారులను కొత్తపల్లి లో బస్సు ఆపే విధంగా ఆదేశాలు ఇచ్చినప్పటికీ బస్సులు ఆపడం లేదనీ దీంతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందుల గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కొత్తపల్లి మీదుగా సుమారు 11 డిపోలకు చెందిన బస్సులు ప్రయాణం చేస్తున్నప్పటికీ ఏ ఒక్క డిపోకు చెందిన బస్సులు కూడా ఆపడం లేదని గతంలో మంత్రి ఆదేశాల మేరకు ఆర్టీసీ ఆర్ఎం కొత్తపళ్లి లో బస్సులు ఆపాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ అవి బుట్ట దాఖలు అయ్యాయని దుయ్యబట్టారు. తక్షణమే ఆర్టీసీ ఈడి స్పందించి కొత్తపల్లిలో బస్సులు ఆపే విధంగా ఆదేశాలు జారీచేసి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేశారు.
ప్రజలకు బస్సులు ఆపకుండా పోవడంతో తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారని తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించి నప్పటికీ ఎక్స్ప్రెస్ బస్సులు నిలప కుండా పోవడంతో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అందరి ద్రాక్షగా మిగిలిందని ఎద్దేవా చేశారు. మహిళలు ఉద్యోగులు కొత్తపల్లి ప్రజలు ఇబ్బందులు పడకుండా అధికార యంత్రాంగం స్పందించి బస్సులు ఆపే విధంగా తక్షణం ఆదేశాలు జారీ చేయాలని లేని పక్షంలో ప్రజల సహకారంతో పెద్ద ఎత్తున ఆందోళనతో రాస్తారోకో చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మాజీ కౌన్సిలర్ స్వర్గం వజ్ర నర్సయ్య చిట్కురి శ్రీనివాస్ కారం రవి ప్రసాద్ బిజెపి నాయకులు తదితరులు ఉన్నారు
