- ఐదు రోజుల పని దినాలను వెంటనే అమలు చేయాలి.
- యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్ నాయకులు..
ప్రభుత్వం మొండి వైఖరి వీడి ఐదు రోజుల పని దినాలను వెంటనే అమలు చేయాలని యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ దేశవ్యాప్తంగా జరిగిన సమ్మెకు మద్దతుగా వనపర్తి జిల్లా ఎస్బిఐ మెయిన్ బ్రాంచ్ రాజీవ్ చౌక్ లో గల ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగుల ఆధ్వర్యంలో ఐబీఏ ప్రతిపాదించిన వారానికి ఐదు రోజుల పని దినాలను వెంటనే అమలు చేయాలని కోరుతూ జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ.. పని గంటల పరంగా ఎలాంటి తగ్గింపు ఉండదనీ ఐదు రోజుల పని దినాలు అమలు చేస్తే ప్రతిరోజు 40 నిమిషాలు అదనంగా ఖాతాదారులకు సేవలు అందిస్తామని యు ఎఫ్ బి యు నాయకులు అంగీకరించినప్పటికీ ప్రభుత్వ మొండి వైఖరితో వ్యవహరిస్తుందని.. ప్రభుత్వం వైఖరి ఇలాగే కొనసాగితే మరిన్ని ఉద్యమాలు చేపట్టి ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఐదు రోజుల పని దినాలను ప్రభుత్వం పరిష్కరించే వరకు నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయని బ్యాంకు ఉద్యోగులు, యూనియన్ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులు, మహిళా ఉద్యోగులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
