Wednesday, February 11, 2026
Homeరంగారెడ్డిYellampet Municipality | 22వ వార్డు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నిశితారెడ్డి

Yellampet Municipality | 22వ వార్డు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నిశితారెడ్డి

ప్రజల సమస్యల పరిష్కారానికి నిశిత రెడ్డి కృషి చేస్తారని, ఎల్లంపేట్ అభివృద్ధికి బీఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉందని మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి నిశిత రెడ్డి కృషి చేస్తారని, ఎల్లంపేట్ అభివృద్ధికి బీఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉందని మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు.

మంగళవారం ఎల్లంపేట్ మున్సిపల్ పరిధిలోని కోనాయిపల్లి గ్రామంలో పలువురు నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ పార్టీ మహిళా నాయకురాలు నిశితారెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరిన వారికి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.

- Advertisement -

ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం కల్ పడుతున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. ఎల్లంపేట్ మున్సిపల్ పరిధిలోని కోనాయిపల్లి, మైసిరెడ్డిపల్లి, నూతన్ గ్రామంలోని 22వ వార్డుకు నిశితారెడ్డిని బీఆర్ఎస్ పార్టీ తరపున అభ్యర్థిగా పోటీకి దించనున్నట్లు ఆయన ప్రకటించారు.

బస్ సౌకర్యం కల్పించాలి

కోనాయిపల్లి గ్రామానికి బస్సు సౌకర్యం లేకపోవడంపై మహిళలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడంతో, మేడ్చల్ ఆర్టీసీ డిపో మేనేజర్తో ఫోన్లో మాట్లాడి బస్సు సౌకర్యం కల్పించాలని సూచించారు. అలాగే గ్రామంలోని యువత కోసం ఛత్రపతి శివాజీ విగ్రహం ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో మేడ్చల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు చామకూర మహేందర్ రెడ్డి, మేడ్చల్ జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ భాస్కర్ యాదవ్, మండల అధ్యక్షులు దయానంద్ యాదవ్, ప్రధాన కార్యదర్శి సుదర్శన్, డబిల్పూర్ పీఎసీఎస్ మాజీ ఛైర్మన్ సురేష్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ వెంకటేష్, నాయకులు మద్దుల శ్రీనివాస్ రెడ్డి, రాజమల్లారెడ్డి, జీవన్, యూసుఫ్, నవీన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News