- క్యాలెండర్ ను ఆవిష్కరించిన సికింద్రాబాద్ ఎమ్మెల్యే తీగుళ్ల పద్మారావు గౌడ్
తుకారంగేట్ గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్‌ను సికింద్రాబాద్ ఎమ్మెల్యే టి.పద్మారావు గౌడ్ గురువారం ఘనంగా ఆవిష్కరించారు.తుకారంగేట్ గంగపుత్ర సంఘం అధ్యక్షుడు కైరం కొండ యాదగిరి సారధ్యంలో మంగళవారం నాడు సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ నివాసం వద్ద సంఘం ప్రతినిధులతో కలిసి క్యాలెండర్ను ఆవిష్కరించారు.క్యాలెండర్ ఆవిష్కరణ అనంతరం ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ మాట్లాడుతూ…
తుకారంగేట్ గంగపుత్ర సంఘం చేపడుతున్న సామాజిక కార్యక్రమాలు అభినందనీయమని ప్రశంసించారు.ప్రతి ఏటా క్యాలెండర్‌ను విడుదల చేస్తూ సంఘం తమ సంస్కృతి,సంప్రదాయాలు,ఐక్యతను చాటుతోందని అన్నారు.గంగపుత్ర సంఘం క్యాలెండర్‌కు సమాజంలో ప్రత్యేకమైన గుర్తింపు ఉందని, సామాజిక ఐక్యతను ప్రతిబింబించేలా ఈ క్యాలెండర్ రూపొందించబడిందని తెలిపారు.ప్రతీ ఏటా క్యాలెండర్ విడుదలతో స్థానికంగా సంఘం బలోపేతం తో పాటుగా సమిష్టితత్వం కలుగుతుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా గంగపుత్ర సంఘం అధ్యక్షులు కైరం కొండ యాదగిరి మాట్లాడుతూ,ప్రతీ ఏటా గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో క్యాలెండర్‌ను విడుదల చేయడం ఆనవాయితీగా కొనసాగుతుందని తెలిపారు.సంఘం చేపడుతున్న సేవా కార్యక్రమాలు,సామాజిక కార్యక్రమాలు ప్రజలకు చేరువయ్యేలా క్యాలెండర్‌ను రూపొందిస్తున్నామని చెప్పారు. భవిష్యత్తులో కూడా సంఘం తరపున మరిన్ని ప్రజాప్రయోజన కార్యక్రమాలు చేపట్టేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గంగపుత్ర సంఘం ప్రధాన కార్యదర్శి కరెలి రామానుజం,ఉపాధ్యక్షులు పల్లె బాలయ్య,కార్యదర్శి పెంటం రవి,ప్రచార కార్యదర్శి కుంట యాదగిరి,మామిండ్ల జగదీష్,అంగలి లక్ష్మి నర్సిములు,గౌటే సురేందర్తో పాటు పలువురు సంఘ నాయకులు,సభ్యులు పాల్గొన్నారు.
