- లింగ బలిజ సంఘం
రాష్ట్ర వీర శైవ లింగాయత్ లింగాబలిజ సంఘం ఇటీవల ఎన్నికైన నూతన సర్పంచ్ లకు సన్మాన సభ ను నిర్వహించారు.ఆదివారం కోకపేటలో నిర్వహించిన వీరశైవ లింగాయత్ బహిరంగ సభకు జహీరాబాద్ ఎంపీ సురేష్ శెట్కార్,రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే టీ.ప్రకాష్ గౌడ్, జహీరాబాద్ మాజీ ఎంపీ బీబీ పాటిల్ లు హాజరై యాదాద్రి జిల్లా మోత్కూరు మండలం దాచారం గ్రామ సర్పంచ్ కర్నే జ్యోతి వీరేశం ను ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు పట్లోళ్ల సంగమేశ్వర్,అధ్యక్షులు దినేష్ పాటిల్,ప్రధాన కార్యదర్శులు రాచప్ప, కడపల్ల సోమేశ్వర్,కొట్టె మహేష్,భరత్,కర్నె బస్వయ్య,ఉమేష్, గోధుమల శివశంకర్,ఆరానీ సోమరాజు,దర్మిశెట్టి శ్రీను తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -
