Wednesday, February 11, 2026
HomeరాజకీయంKTR | బండి, అర్వింద్ క్షమాపణ చెప్పాలి

KTR | బండి, అర్వింద్ క్షమాపణ చెప్పాలి

వారిద్దరికి లీగల్ నోటీసులు పంపిన కేటీఆర్

బీజేపీ నేత(Bjp Leader), కేంద్ర మంత్రి(Union Minister) బండి సంజయ్‌కి, అదే పార్టీకి చెందిన నిజామాబాద్ ఎంపీ(Nizamabad MP) ధర్మపురి అర్వింద్‌(Dharmapuri Arvind)కి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్(Brs Party Working President) కేటీఆర్ శనివారం లీగల్ నోటీసులు పంపారు. తనపైన, తన ఫ్యామిలీపైన ఆధారాల్లేకుండా, పరువుకు నష్టం కలిగించేలా కామెంట్స్ చేసినందుకు వాళ్లిద్దరికి వేర్వేరుగా లీగల్ నోటీసులు(Legal Notices) ఇచ్చారు. తన రాజకీయ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా, తనపై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని దెబ్బతీసేలా చేసిన తీవ్ర వ్యాఖ్యల పట్ల ఈ విధంగా స్పందించారు. బాధ్యత కలిగిన పదవుల్లో ఉండి ఇష్టమొచ్చినట్లు మాట్లాడిన ఆ ఇద్దరు తక్షణం క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

- Advertisement -

ఆ ఇరువురు చెడు ఉద్దేశాలతో పాలిటిక్స్ కోసం తమ స్థాయిని దిగజార్చుకొని మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ ఫ్యామిలీ ఫోన్ ట్యాపింగ్ చేసి వేల కోట్ల రూపాయలు సంపాదించిందని బండి సంజయ్ నిన్న(శుక్రవారం) ప్రెస్ మీట్‌లో ఆరోపించారు. అయితే.. ఆయన చేసిన వ్యాఖ్యల్లో ఏమాత్రం వాస్తవం లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. అర్వింద్‌ తనపై చేసిన వ్యక్తిగత దూషణలను కేటీఆర్ తప్పుబట్టారు. డ్రగ్స్ సేవిస్తానని, సరఫరా చేస్తానని ఎంపీ చేసిన వ్యాఖ్యలను ఆక్షేపించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News