Wednesday, February 11, 2026
Homeనిజామాబాద్‌Banswada Mla | మార్కండేయ జయంతి ఉత్సవాల్లో పోచారం

Banswada Mla | మార్కండేయ జయంతి ఉత్సవాల్లో పోచారం

మార్కండేయ జయంతి(Markandeya Jayanti) సందర్భంగా బాన్సువాడ పట్టణంలోని మార్కండేయ ఆలయంలో పద్మశాలి సంఘం ఏర్పాటుచేసిన ఉత్సవాల్లో స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి(Pocharam Srinivas Reddy) పాల్గొన్నారు. స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బాన్సువాడ నియోజకవర్గం కోటగిరి మండల కేంద్రంలోని రామాలయంలో 18వ వార్షికోత్సవం సందర్భంగా సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత.. బాన్సువాడ పట్టణ కేంద్రంలో 3, 17 వార్డుల్లో పర్యటించి ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ‘గతంలో బాన్సువాడ పట్టణాన్ని సుమారు రూ.200 కోట్లతో అభివృద్ధి చేసుకున్నాం. రానున్న మునిసిపల్ ఎన్నికల్లో(Municipal Election) బాధ్యతతో పనిచేసేవారినే ఎన్నుకోండి. అప్పుడు మాత్రమే బాన్సువాడ పట్టణం అభివృద్ధిలో రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలుస్తుంది’ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్(Chairman of State Agros) కాసుల బాలరాజు, బాన్సువాడ పట్టణ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News