Monday, February 23, 2026
Homeఆరోగ్యంBreast Milk | అమ్మ పాలు.. అమృతం కన్నా..

Breast Milk | అమ్మ పాలు.. అమృతం కన్నా..

తల్లి పాలు(Mother’s Milk) సహజసిద్ధమైనవి(Natural), ఆరోగ్యకరమైనవి. కృత్రిమ పాలు(Artificial milk) కలుషితమైనవి(Polluted). అందువల్ల శిశువులకు అమ్మ పాలే ఇవ్వాలి. అవి అమృతం(Amrit) కన్నా తియ్యనైనవి. విలువైనవి. తల్లిపాలు సురక్షితం(Safe). డబ్బా పాలు(Canned Milk) డేంజర్(Danger). ప్రకృతి సిద్ధమైన అమ్మ పాలు.. పిల్లల్ని కెమికల్స్ నుంచి, బ్యాక్టీరియాల నుంచి కాపాడతాయి. బిడ్డ ఎదుగుదలకు అన్ని విధాలుగా తోడ్పడతాయి. చైల్డ్ బ్రెయిన్ తొలి రెండేళ్లలోనే 85 శాతం నుంచి 90 శాతం వరకు అభివృద్ధి చెందుతుంది. కాబట్టి రొమ్ము పాలే రక్షణ కవచం అని వైద్యులు సూచిస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ప్యాకెట్ పాలు వాడాల్సి వస్తే ఎక్స్‌పైరీ డేట్‌తోపాటు ప్యాకింగ్ క్వాలిటీని కూడా పరిశీలించి కొనాలి. పైగా ఈ సీసా పాలను ఎక్కువసేపు నిల్వ ఉంచకూడదు. కొన్న వెంటనే వాడాలి. ఫార్ములా పాలను వాడిన తర్వాత ఏవైనా సమస్యలు వస్తే వెంటనే డాక్టర్‌ను కలవాలి. పిల్లల్ని నవ మాసాలూ మోసి ప్రాణాలను పణంగా పెట్టి కన్న తల్లులు.. పాల విషయంలో కూడా అంతే శ్రద్ధ చూపాలి. 90 శాతం డబ్బా పాలు పట్టకపోవటమే ఉత్తమం అని వైద్యులు చెబుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News