రాజకీయాల్లో అసలైన “కింగ్ మేకరు కార్యకర్త.. రాజకీయాల్లో పదవులు మారవచ్చు..నాయకులు మారవచ్చు..కానీ ప్రజల మధ్య ఉండి, గెలుపు, ఓటముల్ని నిర్ణయించే శక్తి మాత్రం కార్యకర్తదే.వాడు ప్రచారం చేస్తాడు.. పేరు లేకుండా వాడు ఓట్లు తెస్తాడు.. పదవి ఆశ లేకుండా వాడు సమస్యలు మోస్తాడు.. స్వార్థం లేకుండా నాయకుడిని గెలిపించేది మాట కాదు మీటింగు కాదుప్లెక్స్ కాదు.. ఇంటి ఇంటికీ వెళ్లే కార్యకర్తే.. అతనే అసలైన కింగ్ మేకర్. నాయకుడు సింహాసనం ఎక్కుతాడు కానీ ఆ సింహాసనాన్ని మోసేది మాత్రం కార్యకర్త భుజాలే. కార్యకర్తను గౌరవించిన నాయకుడే చరిత్రలో నిలుస్తాడు… చరిత్రను తిరగరాస్తాడు
- కుమ్మరి రాజు
- Advertisement -
