- సుందరమైన అలంకరణలు
- దేదీప్య మానంగా వెలుగుతున్న ఆలయం
- మూడు నెలల పాటు జరగనున్న ఉత్సవాలు
- భక్తుల కోరికలను తీర్చుతున్న గ్రామ దేవత ఆలయం
తెలంగాణ రాష్ట్రంలో సుప్రసిద్ధ గ్రామదేవత ఆలయంగా పేరుందిన శ్రీ కొండపోచమ్మ అమ్మవారి ఆలయ బ్రహ్మోత్సవాలు నేటి నుండి ప్రారంభం కన్నున్నాయి. ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఆలయ యంత్రాంగం పటిష్టమైన చర్యలు చేపడుతూనే భక్తుల సౌకర్యార్థం పలు సౌకర్యాలను విస్తృతంగా కల్పించింది. దేవాలయాన్ని సుందరంగా వివిధ రకాల పుష్పాలతో అలంకరణ చేసి విద్యుత్ ద్వీపాలు నడుము దగ..ధగా లాడేలా రూపొందించారు.
దేవాలయ సందర్శనకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎప్పటికీ అప్పుడు సమస్యలు పరిష్కరించేలా దేవాలయ యంత్రాంగం నూతన పద్ధతిలో మౌనికరింగ్ సిస్టం ఏర్పాటు చేశారు. అటు పోలీస్ శాఖ వారు సైతం అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు పటిష్ట భద్రత చర్యలను చేపట్టడం విశేషం.

ఆలయ చరిత్ర….
సుప్రసిద్ధత గ్రామ దేవత ఆలయంగా పేరుగాంచిన కొండపోచమ్మ అమ్మవారు జగదేవపూర్ మండలంలోని తీగుల్ నర్సాపూర్ గ్రామంలో వెలసింది. పచ్చటి ఫైర్లు ఎత్తైన కొండలు అహల్లాదకరమైన వాతావరణం లో ఈ అమ్మవారు ఉండడం విశేషం. కొమురవెల్లి మల్లన్న ఆలయంతో ఈ ఆలయానికి ప్రగాఢమైన అనుబంధం ఉంది మల్లన్న స్వామి వారికి పోచమ్మ తల్లిని చెల్లెలుగా భక్తులు భావిస్తూ ఉంటారు. కొమరవెల్లి మల్లన్న దర్శనం అనంతరం కొండపోచమ్మ అమ్మవారిని దర్శించుకుంటే మరింత మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం. 60 సంవత్సరాల క్రితం ఎలాంటి ప్రాధాన్యత లేని ఈ ఆలయం భక్తుల కోరికలు తీరడంతో దిన..
దినం ప్రవర్ధ మానంగా ఆలయం అభివృద్ధి చెందుతూ అమ్మవారి ప్రభ వెలిగిపోయింది. అమ్మవారి మహత్యం గురించి విశేషమైన కథలు ప్రచారంలో ఉన్నాయి. ప్రతి శుభకార్యానికి ముందు గ్రామ దేవత ఆలయాలను దర్శించుకోవడం ఉంటుంది. ఈ క్రమంలో ఈ అమ్మవారిని దర్శించుకుంటే ఎలాంటి ఆటంకాలు లేకుండా పనులు నిర్విఘ్నంగా జరుగుతాయని భక్తుల విశ్వాసం. ప్రతి సోమవారం మంగళవారం భక్తులు అమ్మవారిని దర్శించుకుని బోనాలు అమ్మవారికి సమర్పిస్తారు.
అమ్మవారి చెరువు ప్రత్యేకత…
అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు చెరువులో స్నానం చేసి భక్తిశ్రద్ధలతో నైవేద్యం వండి అమ్మవారికి బోనం డప్పు చప్పులతో ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి సమర్పిస్తారు ఇలా చేయడం ద్వారా వారు అమ్మవారికి మొక్కిన మొక్కులు తీరుతాయని వారి నమ్మకం. అంతేకాకుండా అమ్మవారి గుడి ప్రాంగణంలో ఉన్న చెరువులో స్నానం చేస్తే దీర్ఘకాలిక వ్యాధులు ఉంటే నయమైతాయని నానుడి నోటిలో ఉంది. అంతేకాకుండా ఈ అమ్మవారిని సంతనం లేనివారు ఈ చెరువులో స్నానం చేసి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి ఆలయం ఎదుట ముడుపులు కడితే వారికి సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. వారి నమ్మకం ఫలించడంతో సంతానం కలిగిన దంపతులు మళ్లీ అమ్మవారినీ దర్శించుకుని అమ్మవారికి బోనం, పట్నం ఆనవాయితీగా వస్తుంది. కొండ పోచమ్మ సాగర్ తో అమ్మవారి పేరు రాష్ట్ర వ్యాప్తంగా మారి మోగిపోయింది.
కొండపోచమ్మ అనే బహుళార్థ సాధక ప్రాజెక్టుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమ్మవారి పేరు పెట్టడం వలన అమ్మవారి ప్రభ వెలిగిపోయింది. ఉత్తర తెలంగాణ ప్రాంతం లో వ్యవసాయ అవసరాలను మరియు హైదరాబాద్ జంట నగరాలు ప్రాంతాల మంచినీటి సౌకర్యాన్ని తీర్చే క్రమంలో కూడా ఈ అమ్మవారి ప్రాజెక్టు ఉపయోగపడుతుంది. ఈ ప్రాజెక్టును వీక్షించడానికి చుట్టుప్రక్కల ప్రాంతాల వారు కాకుండా హైదరాబాద్ జంట నగరాల ప్రజలు రావడం విశేషం. గతంలో మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఈ కొండ పోచమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణాన్ని అభివృద్ధి పరచడానికి విశిష్ట మైన కృషి కూడా చేశారు. కోట్ల రూపాయలతో మాస్టర్ ప్లాన్ కూడా రెడీ చేశారు.

పోలీసుల పటిష్ట బందోబస్తు..
అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముఖ్యంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఎస్సై కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. వచ్చే భక్తులకు అవాంఛనీయ సంఘటన జరగకుండా క్యూలైన్ ఏర్పాటు చేశారు . ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ ఆలయం వద్ద ఉత్సవాలు సభ్యంగా జరిగే విధంగా కృషి చేస్తున్నారు.

కొండపోచమ్మ ఉత్సవాలలో సాయి యాదవ్ మార్క్ ..
ప్రతి సంవత్సరం అమ్మవారి ఉత్సవాలలో భాగంగా అంబర్పేట్ చెందిన సాయి యాదవ్ మార్క్ కనిపిస్తుంది. అమ్మవారి ఉత్సవాలు ప్రారంభం కావడంతో అమ్మవారికి ఆయన కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.అంతేకాకుండా అమ్మవారి ఆయన ఘటం కుండా, పట్నం వేసి మొక్కులు చెల్లించుకుంటారు . అమ్మవారి ఆలయం వద్ద వచ్చే భక్తులకు అన్నవితరణ కార్యక్రమం చేపడతారు. తదనంతరం జూబ్లీహిల్స్ నూతనంగా ఎమ్మెల్యే గా ఎన్నికైన నవీన్ యాదవ్ వారి కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించు కాబోతున్నట్లు సమాచారం.

