మహాత్మా జ్యోతిరావు ఫూలే(Mahatma Jyotiba Phule) చిత్రాన్ని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చూశారు. అనంతరం డిప్యూటీ సీఎం(Deputy CM) మల్లు భట్టివిక్రమార్క(Mallu BhattiVikramarka) మీడియాతో మాట్లాడుతూ.. ఫూలే జీవిత చరిత్రను సినిమాలో చూపించిన మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar)కి ధన్యవాదాలు తెలిపారు. ఈ సినిమా మన సమాజానికి అద్భుత సందేశం అందించే చిత్రమని పేర్కొన్నారు. మహిళల(Ladies) కోసం జ్యోతిబాఫూలే, సావిత్రిబాయి ఫూలే చూపిన ప్రత్యేక శ్రద్ధ ఆదర్శనీయమని చెప్పారు. మహిళలతోపాటు కుల వివక్షను, ఇతర ఇబ్బందులు తట్టుకొని సమ సమాజ స్థాపనకు కృషి చేశారని తెలిపారు. వారు వేసిన పునాదులపైన వారి ఆశయాలు, కోరికలు, లక్ష్యాలను సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ముందుకు తీసుకుపోతోందని పేర్కొన్నారు.
Phule Movie | ఫూలే మూవీ చూసిన సీఎం, మంత్రులు
By Aadab Desk
- Advertisement -
Previous article
Next article
