Wednesday, February 11, 2026
Homeఖమ్మంPolice | న్యూ ఇయర్.. బీ కేర్ ఫుల్..

Police | న్యూ ఇయర్.. బీ కేర్ ఫుల్..

ఇల్లందు మండల, పట్టణ ప్రజలకు పోలీసుల సూచనలు

ఇల్లందు, డిసెంబర్ 30(ఆదాబ్ హైదరాబాద్): న్యూఇయర్ నేపథ్యంలో ఇల్లందు మండల(Yellandu Mandal), పట్టణ(Town) ప్రజలకు పోలీసులు పలు సూచనలు చేశారు. 2026 నూతన సంవత్సర వేడుకల(New Year Celebrations)ను మీరు.. మీ కుటుంబ సభ్యులతో సంతోషం(Happy)గా జరుపుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. యువకులు(Youth) మద్యం(Liquor) సేవించి బైక్‌ల మీద ప్రమాదకరంగా విన్యాసాలు చేయటం, అతిగా శబ్దాలు చేయటం వంటి వాటికి పాల్పడి ప్రజలను భయబ్రాంతులకు గురిచేయొద్దని సూచించారు. చట్టానికి విరుద్ధంగా వ్యవహరిస్తే ఆయా వాహనాలను స్వాధీనం చేసుకొని కేసులు నమోదుచేస్తామని చెప్పారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం చేస్తే కేసులు బుక్ చేస్తామని హెచ్చరించారు.

- Advertisement -

గొలుసుకట్టు దుకాణాల్లో మద్యం విక్రయించినా, సేవించినా కేసులు నమోదు(Case Book) చేస్తామని చెప్పారు. నూతన సంవత్సరం సందర్బంగా ఇల్లందు నలువైపులా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టు(Drunk And Drive Test)లు నిర్వహిస్తామని, అందువల్ల మద్యం సేవించి వాహనాలు నడపొద్దని వార్నింగ్ ఇచ్చారు. మద్యం సేవించి పోలీసులకు దొరికితే జైలుకి వెళ్లాల్సి ఉంటుందని హితవు పలికారు. ఇంట్లో బంధుమిత్రులతో సంతోషంగా గడపాల్సిన సమయంలో పోలీస్ స్టేషన్‌‌లో ఉండొద్దని సూచించారు. మహిళల పట్ల మర్యాదగా మసలుకోవాలని, మీ ఆనందం కోసం ఇతరులను ఇబ్బందులకు గురిచేసి చట్టానికి విరుద్ధంగా ప్రవర్తించొద్దని ఇల్లందు పోలీస్ స్టేషన్ ఎస్ఐ టి.సురేష్ పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News