Tuesday, March 3, 2026
HomeతెలంగాణHarish Rao | వెన్నుపోటుకు మారు పేరు సీఎం రేవంత్ రెడ్డి

Harish Rao | వెన్నుపోటుకు మారు పేరు సీఎం రేవంత్ రెడ్డి

  • కేసీఆర్ స్టేట్స్మెన్లా మాట్లాడితే.. రేవంత్ స్ట్రీట్ రౌడీలా మాట్లాడారు
  • రేవంత్ను తెలంగాణ ద్రోహిగా కేసీఆర్ ప్రజల ముందు నిలబెట్టారు
  • ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అపసోపాలు
  • కాంగ్రెస్ అనుభవమంతా దోపిడీకి, లూటీకి పనికొస్తుంది..
  • హామీలపై మాయ మాటలు చెబితే ఎలా
  • ఉత్తమ్కు విషయ పరిజ్ఞానం లేదు
  • మండిపడ్డ బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు

రేవంత్‌ రెడ్డికి నీతి జాతి లేదని, ఎప్పుడు ఏ పార్టీలో ఉంటాడో కూడా తెలియనది, రేవంత్‌ రెడ్డి… రేపు ఏ పార్టీలో ఉంటాడో తెలియ దని సీఎం రేవంత్‌ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్‌ రావు హాట్‌ కామెంట్స్‌ చేశారు. సోమవారం నాడు విూడియాతో మాట్లా డుతూ.. కేసీఆర్‌ స్టేట్స్‌మెన్‌లా మాట్లాడితే.. రేవంత్‌ స్ట్రీట్‌ రౌడీ మాదిరి మాట్లాడారని విమర్శించారు. త్యాగాల చరిత్ర తమది అని.. వెన్నుపోటుకు మారు పేరు రేవంత్‌ రెడ్డి అని కామెంట్స్‌ చేశారు. సంకుచిత, మరగుజ్జు మనస్తత్వంతో ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌ను తెలంగాణ ద్రోహిగా కేసీఆర్‌ ప్రజల ముందు నిలబెట్టారని అన్నారు. కేసీఆర్‌ ప్రజల పక్షాన ప్రశ్నిస్తే.. సీఎం, నీళ్ళ మంత్రికి ఎందుకంత నొప్పి అని నిలదీశారు. ఎవరి ఒత్తిడితో నీటి వాటాను తగ్గించుకు న్నారని ప్రశ్నించారు. 45 టీఎంసీలకు.. మంత్రి ఉత్తమ్‌ స్వయంగా తన దస్తూరితో కేంద్రానికి లేఖ రాశారని చెప్పారు. ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి..

ఉత్తర కుమారుడిలా మిగిలిపోయారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ అనుభవమంతా దోపిడికి, లూటీకి పనికొస్తుందంటూ వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ ఆదివారం ప్రెస్‌విూట్‌లో మాట్లాడిన మాటలపై రేవంత్‌ రెడ్డి చిట్‌చాట్‌లో స్పందించిన తీరును బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత హరీశ్‌రావు తప్పుపట్టారు. తెలంగాణ భవన్‌లో విూడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. కేసీఆర్‌ ఒక స్టేట్స్‌మెన్‌లా మాట్లాడితే.. రేవంత్‌ రెడ్డి స్ట్రీ రౌడీలా మాట్లాడారని విమర్శించారు. ఓ గల్లీ రౌడీ మాటల్లా, ఓ గూండా మాటల్లా రేవంత్‌రెడ్డి మాటలు ఉన్నాయని విమర్శించారు. తెలంగాణకు ఒక నొక్కుపడనియ్యను అని కేసీఆర్‌ చాలా గొప్పగా మాట్లాడారని, ఆ మాటతో సీఎం రేవంత్‌రెడ్డికి, నీటిపారుదల మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డికి వచ్చిన నొప్పి ఏమిటో అర్థం కావడం లేదని హరీశ్‌ రావు అన్నారు. తప్పు చేసిండ్రు కాబట్టే వాళ్లకు నొప్పి కలుగుతున్నదని వ్యాఖ్యానించారు.

- Advertisement -

ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి నిన్న ఉత్తరకుమారుడిగా తేలిపోయారని ఎద్దేవా చేశారు. ఆసరా పింఛన్‌లను రూ.4 వేలకు పెంచుతామని ఎందుకు పెంచలేదని కేసీఆర్‌ ప్రశ్నించారని, దానికి విూరు ఎందుకు సమాధానం చెప్పలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీకి అపారమైన అనుభవం ఉన్నదని, నిధులు ఎలా సవిూకరించాలో, ప్రజలకు ఎలా ఇవ్వాలో బాగా తెలుసని ఎన్నికల ముందు చెప్పిండ్రు కదా.. ఇప్పుడు ఏమైంది విూ అనుభవం అని హరీశ్‌రావు కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని నిలదీశారు. విూ అనుభవం అంతా దోపిడీలకు, కమిషన్‌లకు, వాటాలకు, లూటీలకే సరిపోయిందా..? అని ప్రశ్నించారు. ’బీఆర్‌ఎస్‌ హయాంలో ఆటో డ్రైవర్‌కు ఫోన్‌ చేస్తే యూరియా బస్తాలు తెచ్చి ఇంట్లో వేసి వెళ్లేవారని, ఇప్పుడు చెప్పులు లైన్‌లో పెట్టే పరిస్థితి వచ్చిందని, యాప్‌లు, మ్యాప్‌లతో రైతులను ఎందుకు గోసపెడుతున్నరని కేసీఆర్‌ ప్రశ్నించారు. దానికి విూ సమాధానం ఏదీ అని హరీశ్‌రావు అన్నారు.

హైదరాబాద్‌ నగర శ్రేయస్సు కోసం తాము పార్మాసిటీ కోసం కేటాయించిన స్థలంలో ఇప్పుడు ఫ్యూచర్‌ సిటీ ఎందుకు అంటున్నారని కేసీఆర్‌ అడిగిన ప్రశ్నకు సీఎం నుంచి సమాధానం లేదని హరీశ్‌రావు మండిపడ్డారు. కేసీఆర్‌ రాష్ట్ర ప్రయోజనాల గురించి, హైదరాబాద్‌ శ్రేయస్సు గురించి మాట్లాడితే.. రేవంత్‌ రెడ్డి అంతా సొల్లు మాట్లాడారని విమర్శించారు. ’కేసీఆర్‌ హయాంలో ఆర్థిక అరాచకత్వం సాగింది’ అన్న సీఎం రేవంత్‌ రెడ్డి మాటలపై కూడా మాజీ మంత్రి మండిపడ్డారు. ఇటీవల జరిగిన గ్లోబల్‌ సమ్మిట్‌లో నువ్వు ఆహ్వానించిన ప్రముఖులే తెలంగాణ ఆర్థిక ప్రగతిని కొనియాడారని హరీశ్‌రావు గుర్తుచేశారు. బ్రిటన్‌ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌, ఆర్బీఐ గవర్నర్‌ సుబ్బారావు మాట్లాడిన మాటలను రేవంత్‌ రెడ్డి ఒకసారి వీడియో పెట్టుకుని చూడాలని సూచించారు.

కొత్త రాష్ట్రమైనా తెలంగాణ అద్భుతమైన ఆర్థిక ప్రగతిని సాధించిందని, మూడు రెట్ల జీఎస్‌డీపీని సాధించిందని, మూడు రెట్ల తలసరి ఆదాయం పెరిగిందని వారు కేసీఆర్‌ పాలనను మెచ్చుకున్న విషయాన్ని గుర్తుచేశారు. ఎమ్మెల్యేను కొంటూ రూ.50 లక్షలతో పట్టపగలు దొరికిన దొంగ రేవంత్‌ రెడ్డి అని అన్నారు. రూ.50 కోట్లకు రేవంత్‌ పీసీసీ పదవి కొనుకున్నాడని కోమటిరెడ్డి వెంకటరెడ్డే చెప్పారని గుర్తుచేశారు. రేవంత్‌కు ఒక స్టాండ్‌, సిద్దాంతం, పద్ధతి లేదన్నారు. ధాన్యం, డాక్టర్ల ఉత్పత్తిలో తెలంగాణను నంబర్‌ వన్‌ చేసిందే కేసీఆర్‌ అని అన్నారు. ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి.. ఇప్పుడైనా ప్రిపేర్‌ అయ్యి ప్రెస్‌విూట్స్‌ నిర్వహించాలని ఎద్దేవా చేశారు. నీళ్ళ మంత్రి ఉత్తమ్‌కు సగం సగం నాలెడ్జ్‌ మాత్రమే ఉందంటూ మాజీ మంత్రి హరీష్‌ రావు కామెంట్స్‌ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News