Wednesday, February 11, 2026
HomeజాతీయంISRO | ఇస్రో మరో భారీ ప్రయత్నం

ISRO | ఇస్రో మరో భారీ ప్రయత్నం

  • ఇంకోక బాహుబలి రాకెట్ ప్రయోగానికి సిద్ధం
  • ఈ నెల 24వ తేదీన నింగిలోకి ప్రయోగించనున్న ఇస్రో

సతీశ్‌ థావన్‌ అంతరిక్ష పరిశోధన కేంద్రం మరో ప్రయోగానికి సిద్ధమైంది. ఈ నెల 24వ తేదీన మరో అతిపెద్ద బాహుబలి రాకెట్‌ ప్రయోగానికి ముహూర్తం ఖరారు చేశారు. 24న ఉదయం 8:54గంటలకి బాహుబలి రాకెట్‌ను నింగిలోకి ప్రయోగించనున్నారు. ఈ రాకెట్‌ ఎత్తు 43.5విూటర్లు, బరువు 6400 విూటర్లు ఉండగా.. ఈ రాకెట్‌ ప్రయోగ సమయం 15నిమిషాల 7 సెకన్లు ఉండనుంది. అమెరికాకు చెందిన బ్లూ బార్డ్‌ బ్లాక్‌ 2 శాటిలైట్‌ని నింగిలోకి మోసుకెళ్లనుంది బాహుబలి రాకెట్‌. శాటిలైట్‌ బరువు 6100కిలోలు ఉంది. ఈ శాటిలైట్‌ని అమెరికాకి చెందిన స్పేస్‌ మొబైల్‌ సంస్థ రూపొందించింది.

గతంలో పంపిన శాటిలైట్ల కంటే పదిరెట్లు అధిక సామర్థ్యంతో బ్లూ బార్డ్‌ బ్లాక్‌ 2 శాటిలైట్‌ పనిచేయనుంది. ఎల్‌విఎం రాకెట్‌ సిరీస్‌లో ప్రస్తుతం ఎనిమిదో ప్రయోగం జరగనుంది. ఇప్పటి వరకు జరిగిన ఏడు ప్రయోగాలు విజయవంతమైన విషయం తెలిసిందే. చంద్రయాన్‌3 ప్రయోగానికి ఎల్‌విఎం3 రాకెట్‌ని ఇస్రో వినియోగించనుంది. ఈ నేపథ్యంలో షార్‌కి ఇస్రో చైరన్‌ డాక్టర్‌ నారాయణన్‌, అమెరికా ప్రతినిధులు చేరుకున్నారు. ఎల్‌విఎం2 ఎం6ప్రయోగం పూర్తి వాణిజ్య ప్రయోగంగా తెలుస్తోంది. భవిష్యత్తులో మరిన్ని వాణిజ్య ప్రయోగాలకి అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో షార్‌లో జవాన్లు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేపట్టారు.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES

Latest News