Friday, February 13, 2026
HomeసినిమాSong Launch | 'ఛాంపియన్' మూడో సాంగ్ లాంఛ్

Song Launch | ‘ఛాంపియన్’ మూడో సాంగ్ లాంఛ్

ఛాంపియన్ మూవీ(Champion Movie) నుంచి ఇప్పటివరకు విడుదలైన రెండు పాటలు భారీ చార్ట్‌బస్టర్‌లుగా నిలిచాయి. గిర గిర సాంగ్(Gira gira song) అన్ని ప్లాట్‌ఫామ్‌లలో ట్రెండ్ అవుతూ ఉండగా మనసును కదిలించే సెకండ్ సింగిల్ సల్లంగుడాలే కూడా అద్భుతమైన స్పందన అందుకుంది. రోషన్(Roshan), అనస్వర రాజన్(Anaswara Rajan) లీడ్ రోల్స్‌లో నటించిన ఈ చిత్రం నుంచి మూడో పాటను ఇప్పుడు మేకర్స్ లాంఛ్ చేశారు. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్‌తో కలిసి స్వప్న సినిమా నిర్మించిన ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ సమర్పించారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు.

మూడో సింగిల్ ‘ఐ యామ్ ఏ ఛాంపియన్’ సాంగ్ ఒక ప్రత్యేకమైన, పూర్తి స్థాయి డ్యాన్స్ నంబర్‌గా అలరించింది. గ్రాండియర్‌తోపాటు రిథ్మిక్ ఎలిగెన్స్‌ను కలిపిన ఈ పాట.. భారీ సెట్‌పై, అద్భుతమైన డాన్స్‌లతో కన్నుల పండుగైన విజువల్ స్పెక్టాకిల్‌గా నిలిచింది. ఎనర్జిటిక్ కంపొజిషన్, బలమైన రిథమ్‌తో శ్రోతలను ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఇంటర్‌లూడ్స్ పాటకు మరింత గ్రాండ్ ఫీల్‌ను తీసుకువచ్చి సెలబ్రేటరీ స్పిరిట్‌ అందించాయి. జీవితాన్ని సంపూర్ణంగా ఆస్వాదించాలనే భావనను ప్రతిబింబించే కేకే సాహిత్యం పాటకు బలం చేకూర్చగా.. పి.జయరామ్, రమ్య బెహరా తమ ఎనర్జిటిక్ వోకల్స్‌తో ఉత్సాహాన్ని రెట్టింపు చేశారు.

- Advertisement -

డ్యాన్స్ ఫ్లోర్‌పై రోషన్ అదరగొట్టాడు. జాజ్ బీట్స్‌కు అనుగుణంగా అతని బాడీ లాంగ్వేజ్, ఎలిగెంట్ మూవ్‌మెంట్స్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. షార్ప్, గ్రేస్‌తో నిండిన అతని డాన్స్ స్టెప్స్, రిథమ్, టైమింగ్‌పై అతనికి ఉన్న అద్భుతమైన కంట్రోల్‌ను చాటిచెబుతాయి. ఎక్స్‌ప్రెసివ్ ఫుట్‌వర్క్ నుంచి గ్రూప్ ఫార్మేషన్స్‌కి సులువుగా మారుతూ పాటను తన భుజాలపై మోశాడు. అతని ఎక్స్‌ప్రెషన్స్ డ్యాన్స్‌కు మరింత చార్మ్‌ను జోడించాయి.

అవంతిక కూడా అదే ఎనర్జీతో కనిపించింది. వారి మధ్య కెమిస్ట్రీ తెరపై అదిరిపోయేలా వర్కౌట్ అవుతుంది. పోనీ వర్మ కొరియోగ్రఫీ ఈ పాటకు ప్రధాన హైలైట్‌గా నిలుస్తూ స్టైలిష్ హుక్ స్టెప్‌తోపాటు డైనమిక్ డ్యాన్స్ మూవ్స్‌తో విజువల్స్‌ను మరో లెవల్‌కి తీసుకెళ్లింది.
సీజన్‌కి సరిపోయే జాజ్ సాంగ్‌గా నిలిచిన ‘I Am A Champion’ ఆల్బమ్‌లోని మొదటి రెండు పాటల్లానే మ్యూజిక్ చార్ట్స్‌ను శాసించడానికి సిద్ధంగా ఉంది. అంతేకాదు.. రోషన్ డ్యాన్సింగ్ ప్రావెస్‌ను బలంగా చాటే పాటగా నిలుస్తుంది.

నందమూరి కల్యాణ్ చక్రవర్తి, అర్చన కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి టాప్ టెక్నీషియన్స్‌ పని చేస్తున్నారు. తోట తరణి ప్రొడక్షన్ డిజైనర్, ఆర్.మధీ సినిమాటోగ్రఫీ, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్. ‘ఛాంపియన్’ ఈ క్రిస్మస్‌కు బిగ్గెస్ట్ ఎట్రాక్షన్‌గా డిసెంబర్ 25న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News