సర్పంచ్‌గా చేరుపల్లి మమత గెలుపు ఖాయం
మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ధీమా
పాలకుర్తి మండలం పరిధిలోని తిరుమలగిరి సర్పంచ్‌గా మమతను భారీ మెజారిటీతో గెలిపించాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Errabelli Dayakar Rao), ఉప్పల్ ఎమ్మెల్యే (Uppal Mla) బండారి లక్ష్మారెడ్డి (Bandari Lakshma Reddy) ఓటర్లను కోరారు. గ్రామ పంచాయతీ ఎన్నికల (Gram Panchayat Elections) నేపథ్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ పార్టీ (Brs Party) మళ్లీ అధికారంలోకి వస్తుందని, కార్యకర్తలు, నేతలు సమన్వయంతో కలిసి పనిచేయాలని సూచించారు. కేసీఆర్ నేతృత్వంలో అమలుచేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి గురించి గ్రామస్తులకు వివరించి చైతన్యపరచాలని అన్నా. ఈ కార్యక్రమంలో ఉప్పల్ నియోజకవర్గ కార్పొరేటర్లు BRS పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
