Wednesday, February 11, 2026
Homeఎన్‌.ఆర్‌.ఐSouth Africa Temple | నాసిరకం కట్టడం వల్లే అనర్థం

South Africa Temple | నాసిరకం కట్టడం వల్లే అనర్థం

సౌతాఫ్రికా(South Africa), ఇండియా (India) మధ్య సంబంధాలు బాగానే ఉన్నాయి. చాలా మంది భారతీయులు అక్కడ నివసిస్తున్నారు. విశ్వంలో ఏ దేశానికీ లేని 3 రాజధానులు దక్షిణాఫ్రికాకు ఉన్నాయి. పాలన అందరికీ అందుబాటులో ఉండాలనే 3 రాజధానులను ఏర్పాటుచేసుకున్నారు. ఆ మూడు రాజధానుల్లో ఒకటి.. ప్రిటోరియా. రెండు.. కేప్‌టౌన్. మూడు.. బ్లోమ్‌ఫోంటెయిన్. ప్రిటోరియా.. ఇది పాలనా రాజధాని. ఇక్కడ పరిపాలన కార్యకలాపాలు జరుగుతాయి. కేప్‌టౌన్.. ఇక్కడ శాసన సంబంధ కార్యకలాపాలను నిర్వహిస్తారు. బ్లోమ్‌ఫోంటెయిన్.. ఇక్కడ న్యాయ సంబంధ కార్యకలాపాలు జరుగుతాయి. దక్షిణాఫ్రికా కరెన్సీ ర్యాండ్. అక్కడి భాష ఆఫ్రికాన్స్, ఆంగ్లం. మతం.. క్రైస్తవం. బంగారానికి ఈ దేశం ప్రసిద్ధి.

భారత్‌తో దక్షిణాఫ్రికాకు అవినాభావ సంబంధం ఉంది. ఆ దేశంలో భారత మూలాలు కూడా ఎక్కువే. పెద్ద పెద్ద ప్రావిన్స్‌లు ఉన్నాయి. వాటిలో క్వాజులు నాటల్ ఒకటి. ఇటీవల అక్కడ అతిపెద్ద నరసింహ స్వామి కోవెల (Narasimha Swami Temple) ఏర్పాటుచేయాలని తలచారు. రెడ్ క్లి పే పట్నంలో నివాసం ఉంటున్న ఓ భారతీయ కుటుంబం ఆ గుడిని నిర్మిస్తోంది. ఈ దేవాలయంలో భారతీయులు చక్కటి శిల్ప కళా రీతులను ప్రస్ఫుటించారు. నిర్మాణంలో ఉండగా ఆలయం కూలడం దురదృష్టకరం. అనుమతులులేక కాదు.. నాసిరకం వల్లే అది కూలింది. ఈ ఘటనలో మొత్తం నలుగురు చనిపోయినట్లు తెలుస్తోంది.

- Advertisement -

ఆలయ నిర్మాణ కార్యవర్గ సభ్యుడు విక్కీ జయరాజ్ పాండే ఈ శిథిలాల కింద మరణించారని ఆలయ అన్నదాన డైరెక్టర్ శాన్ మీర్ మహారాజ్ చెప్పారు. భారత్‌లో అహోబిల (Ahobilam) కోవెల లాగే ఈ గుడిని కూడా తీర్చిద్దిద్దుతామని నిర్మాణంలో పాల్గొన్నవారు చెప్పారు. ఈ నిర్మాణానికి అనుమతిలేదని అక్కడి మునిసిపాలిటీ (Municipality) తేల్చింది. ఇలా ఎందుకు జరిగిందో సమీక్షిస్తామని సహకార మంత్రి ధులేసి జివి బుదేలెజీ తెలిపారు. అచ్చం ఇండియాలో మాదిరిగా కట్టడం ఉండాలని, అంటే ‘గుహ’ అరణ్యం, కొండలు, గుట్టలు ఉండేలా చేయాలనే ఆలోచన ఉన్నట్లు నిర్మాణకర్తల్లో ఒకరు చెప్పారు. అందుకు ఇండియా నుండి రాళ్లు తదితరమైనవి తెచ్చే ఆలోచన ఉందని స్పష్టం చేశారు.

ఈ నిర్మాణం పూర్తయితే అక్కడి భారతీయులకు, పర్యాటకులకు (Tourists) మంచి ఆహ్లాద వాతావరణం అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు. అయితే.. నిర్మాణంలో శ్రద్ధ కొరవడిందేమోననే అనుమానం కలుగుతోంది. ఇది భారీ ప్రాజెక్ట్. సరైన నిపుణులు లేరేమోననే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. లేకపోతే.. అంత పెద్ద ప్రాజెక్ట్ కుప్పకూలడమేంటి అనేది పౌరుల అభిప్రాయం. మునిసిపాలిటీ అనుమతి ముఖ్యం కాదు. నాసిరకం పనిముట్లు, మెటీరియల్, సిమెంట్, ఇసుక పైన నిఘా ఉండాలి. ఒక మంచి అధ్యాత్మిక నిర్మాణం ఇలా కుప్పకూలడం అందరి హృదయాలను కలచివేసింది. ఏదేమైనా తప్పులు పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకొని కట్టడంలో క్రమశిక్షణ పాటించి అద్భుత ఆలయం త్వరలో రూపుదిద్దుకుంటుందని ఆశిద్దాం.

  • కనుమ ఎల్లారెడ్డి
- Advertisement -
RELATED ARTICLES

Latest News