Tuesday, February 10, 2026
Homeమెదక్‌Trust | మనపై ఉన్న నమ్మకాన్ని వమ్ము చేయొద్దు

Trust | మనపై ఉన్న నమ్మకాన్ని వమ్ము చేయొద్దు

  • ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేద్దాం
  • ఇచ్చిన వాగ్దానాలను అమలు చేద్దాం
  • సర్పంచ్ లు చెక్కల పరమేష్ , కనకయ్యా

ఎంతో నమ్మకంతో మనల్ని గెలిపించిన ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి నిత్యం వారి సేవ చేసే పనిలో ఉందామని ఎన్నికల సమయంలో ప్రజలకు వాగ్దానాలు అమలు చేద్దామని మనపై ఉన్న నమ్మకాన్ని వమ్ము చేయొద్దని బిజీ వెంకటాపూర్ గ్రామ సర్పంచ్ చెక్కల పరమేష్ ,పలుగు గడ్డ గ్రామ సర్పంచ్ కనకయ్య అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం రోజు జగదేవపూర్ మండలంలో నూతనంగా గెలుపొందిన మునిగడప గ్రామ సర్పంచ్ ముచ్చపతి బాలయ్య, వట్టిపల్లి గ్రామ సర్పంచ్ విద్యాధర్, అనంతసాగర్ గ్రామ సర్పంచ్ లను కలిసి శాలువాతో ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏ పార్టీ వారైనా మనమంతా ఒక్కటే అని మనమంతా కలిమెలసి ఉందామని గ్రామాల్లో ఏ సమస్య ఉన్నా ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరించాలని ప్రజలు మనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకూడదని వారిపై నమ్మకంతో గెలిపించి పలు గ్రామాల ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News