Monday, May 11, 2026
Homeక్రైమ్ వార్తలుCyberabad | 407 మంది డ్రంక్ డ్రైవర్ల అరెస్ట్

Cyberabad | 407 మంది డ్రంక్ డ్రైవర్ల అరెస్ట్

తాగి బండి నడుపుతున్న 407 మంది డ్రైవర్లను సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు (Traffic Police) అరెస్ట్ చేశారు. వారాంతపు ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్‌(Drunk And Drive)లో భాగంగా చేపట్టిన తనిఖీల్లో వీరిని అదుపులోకి తీసుకున్నారు. మద్యం తాగి వాహనం నడపడం వల్ల జరిగే ప్రాణాంతక ప్రమాదాల(Accidents)కు భారతీయ న్యాయ సంహిత (BNS) చట్టంలోని సెక్షన్ 105 కింద 10 ఏళ్ల వరకు జైలు శిక్ష (Jail Term) సహా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

నిందితుల్లో ఎక్కువ మంది ద్విచక్ర వాహనదారులే ఉన్నారు. 290 కేసులు టూవీలర్‌లకు సంబంధించినవే. ఫోర్ వీలర్ కేసులు 90, త్రీ వీలర్ కేసులు 18, భారీ వాహనాల కేసులు 9 ఉన్నాయి. 2025 డిసెంబర్ 8 నుంచి 13 వరకు మొత్తం 385 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులను కోర్టులు పరిష్కరించాయి. వీటిలో 16 మందికి జైలు శిక్షతోపాటు జరిమానా (Fine) విధించారు. 21 మందికి జరిమానా, సామాజిక సేవ శిక్ష పడింది. 348 మంది నేరస్థులకు జరిమానాలు విధించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News