ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ(Khanapur Assembly Constituency) పరిధిలోని గ్రామ పంచాయతీ ఎన్నికల్లో(Gram Panchayat Elections) విజయం సాధించిన అభ్యర్థులకు ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్(MLA Vedma Bojju Patel) హార్దిక శుభాకాంక్షలు(Warm Wishes) తెలిపారు. గెలుపొందినవారు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. పంచాయతీల్లో నెలకొన్న సమస్యలను తమ దృష్టికి తీసుకొస్తే వాటిని ప్రభుత్వం ద్వారా సత్వరం పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. రెండు, మూడు దశల్లో జరిగే ఎన్నికల్లోనూ ప్రజలు.. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు ఓటేయాలని కోరారు.
- Advertisement -
