చాలా మందికి పెళ్లయిన ఏడాదిలోపే పిల్లలు పుడతారు. కానీ.. కొంత మందికి ఐదేళ్లు, పదేళ్లయినా సంతాన భాగ్యం కలగదు. దీనికి పలు కారణాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైంది.. వయసు. మగవారిలో గానీ, ఆడవాళ్లలో గానీ 35 ఏళ్ల వయసు తర్వాత పిల్లలు పుట్టే అవకాశాలు తగ్గుతాయి. ఇంకా చెప్పాలంటే.. లేడీస్(Ladies)కి ఈ సమస్య 32 ఏళ్ల నుంచే మొదలవుతుంది.
కాబట్టి.. జీవితంలో చదువులకు, ఉద్యోగాలకు ఎంత ప్రాధాన్యత ఇస్తామో.. పెళ్లి(Marriage)కి, పిల్లల్ని కనటానికి కూడా అందే ఇంపార్టెన్స్ ఇవ్వాలని వైద్యులు సూచిస్తున్నారు. శారీరక అంశానికి వస్తే.. పిల్లలు పుట్టకపోవటానికి భార్య, భర్త ఇద్దరూ సమానంగా కారణమవుతారు. ఎవరిలోనూ దోషం ఎక్కువగా ఉండదు. స్త్రీలలో రుతుక్రమం (Menstruation) సరిగా జరగకపోవటం, ఒబెసిటీ(Obesity), హార్మోన్లు (Hormones) సరిగా లేకపోవటం కారణం కావొచ్చు.
అండాశయాలతోపాటు అవయవాల్లో లోపాలు తదితర కారణాల వల్ల కూడా గర్భధారణలో ఇబ్బందులు ఎదురవుతాయి. పురుషుల్లో క్రోమోజోమ్‌లలో లోపాలు, వరిబీజం, మద్యపానం, సిగరెట్, డ్రగ్స్ వంటివి పిల్లలు పుట్టకపోవటానికి దారితీస్తాయి. సంతానం కోరుకునేవారు ఇన్‌విట్రో ఫెర్టిలైజేషన్ (IVF) వంటి పద్ధతులు పాటించొచ్చు. డాక్టర్లను సంప్రదిస్తే మరిన్ని వివరాలు చెబుతారు.
