- ఎమ్మెల్యే సత్యం
కోరేం గ్రామ సర్పంచుగా జవ్వాజి విజయలక్ష్మిని గెలిపించాలని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కోరారు.శుక్రవారం నాడు బోయినపల్లి మండలం లోని కోరేం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ, ప్రజలతో జవ్వాజి విజయలక్ష్మి ని గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..
కాంగ్రెస్ పార్టీ బలపర్చిన సర్పంచ్ లను గెలిపిస్తే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ఎమ్మెల్యే మేడిపెల్లి సత్యం అన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలఅమలుకు కాంగ్రెస్ పార్టీ బలపరచిన అభ్యర్థులను గెలిపిస్తే అభివృద్ధికి అటంకాలు ఉండవన్నారు. స్నేహశీలి,సౌమ్యురాలు అయిన జవ్వాజి విజయలక్ష్మి ధనుంజయ్ గుర్తు కత్తెర గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలాన్నారు.ఈ కార్యక్రమం లో మండల కాంగ్రెస్ అధ్యక్షులు వన్నెల రమణారెడ్డి తదితరులు న్నారు
