- ఇది గ్లోబల్ సమ్మిట్ కాదు.. భూములు అమ్ముకునేందుకు ఏర్పాటు చేసిన రియల్ ఎస్టేట్ సమ్మిట్
- పెట్టుబడుల పేరుతో కోట్లు ఖర్చు చేశారు
- విజన్ డాక్యుమెంట్‌లో విజన్ లేదు..అది విజన్ లెస్ డాక్యుమెంట్˜ ఎంవోయూల వెనక చీకటి ఒప్పందాలు
- మాజీ మంత్రి హరీష్ రావు
కాంగ్రెస్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌పై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆయన.. ఇది గ్లోబల్ సమ్మిట్ కాదని.. భూములు అమ్ముకునేందుకు ఏర్పాటు చేసిన రియల్ ఎస్టేట్ సమ్మిట్ అంటూ వ్యాఖ్యలు చేశారు. అందాల పోటీల్లాగే, ఏఐ సమ్మిట్ లాగే.. గ్లోబల్ సమ్మిట్ కూడా అట్టర్ ప్లాప్ షో అయ్యిందంటూ కామెంట్స్ చేశారు.
పెట్టుబడుల కట్టు కథలు చెప్పి, కోట్లు ఖర్చు చేసి గ్లోబల్ సమ్మిట్‌ను అట్టర్ ఫ్లాప్ చేశారంటూ ఫైర్ అయ్యారు. గ్లోబల్ సమ్మిట్ పేరిట రియల్ ఎస్టేట్ స్కాంకు తెరతీశారంటూ మాజీ మంత్రి సంచలన ట్వీట్ చేశారు. ’విజన్ డాక్యుమెంట్‌లో విజన్ లేదు, దాన్ని చేరుకునే మిషన్ లేదు, విజన్ డాక్యుమెంట్ కాదు.. ’విజన్ లెస్’ డాక్యుమెంట్. క్యూర్, ప్యూర్, రేర్ అంటూ అంటున్న రేవంత్ రెడ్డి.. తెలంగాణను కొల్లగొడుతున్న చోర్. గ్లోబల్ సమ్మిట్‌లో ఎంవోయూల వెనుక చీకటి ఒప్పం దాలు, అంకెల గారడీ తప్ప ప్రజలకు పనికొచ్చే పనులు ఏవీ లేవు.
రెండేళ్లుగా కోట్లు ఖర్చు చేసి తిరిగిన దేశాలు, నిర్వహించిన సమ్మిట్స్ ద్వారా మొత్తం ఎన్ని కోట్ల పెట్టుబడులు వచ్చాయి? అందు లో ఎన్ని కంపెనీలు గ్రౌండ్ అయ్యాయి? ఎంత మంది తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు వచ్చాయి.. దమ్ముంటే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్. కేసీఆర్ పాలనలో జరిగిన అభివృద్ధి గురించి గ్లోబల్ సమ్మిట్ వేదికగా టోనీ బెయిర్, సుబ్బారావు ఇచ్చిన కితాబు రేవంత్ రెడ్డికి చెంపపెట్టు. రేవంత్ రెడ్డి నిర్వహించింది గ్లోబల్ సమ్మిట్ లాగా లేదు, భూములు అమ్మకునేందుకు ఏర్పాటు చేసిన రియల్ ఎస్టేట్ సమ్మిట్’ అంటూ హరీష్ రావు ఎక్స్‌లో ట్వీట్ చేశారు.
