Tuesday, March 3, 2026
Homeమహబూబ్‌నగర్‌Sarpanch | మనిగిళ్ళ సర్పంచిగా శివ యాదవ్ ను గెలిపించండి.

Sarpanch | మనిగిళ్ళ సర్పంచిగా శివ యాదవ్ ను గెలిపించండి.

  • బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ డాక్టర్ రాచాల యుగంధర్ గౌడ్..

మనిగిళ్ళ గ్రామ సర్పంచిగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి శివ యాదవ్ కత్తెర గుర్తుపై ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని బీసీ పొలిటికల్ జెఎసి స్టేట్ చైర్మన్ డాక్టర్ రాచాల యుగంధర్ గౌడ్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. మంగళవారం పెద్దమందడి మండలం మనిగిళ్ల గ్రామంలో శివకు మద్దతుగా ప్రచారం నిర్వహించి మాట్లాడారు. గత ప్రభుత్వంలో మనిగిళ్ళ గ్రామంలో జరిగిన అక్రమాలను, మాజీ మంత్రి కబ్జాల మీద ప్రశ్నించిన శివ యాదవ్ ను అక్రమంగా అరెస్టు చేయించి పోలీసులచే లాఠీ దెబ్బలు కొట్టించి నాటి పాలకులు పైశాచిక ఆనందం పొందారన్నారు. లాటీ దెబ్బలు తిని కేసులను ఎదుర్కొని ధైర్యంగా నిలబడిన శివ యాదవ్ కి ఎమ్మెల్యే మేఘారెడ్డి మనిగిళ్ల సర్పంచ్ అభ్యర్థిగా అవకాశం కల్పించారని అన్నారు.

ఎమ్మెల్యే మేఘారెడ్డికి అత్యంత సన్నిహితుడుగా ఉన్న శివ యాదవ్ ద్వారానే మనిగిళ్ళ గ్రామ అభివృద్ధి సాధ్యమని, శివ యాదవ్ ను అత్యధిక మెజారిటీ తో గెలిపించి గ్రామ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ తిరుపతి రెడ్డి, బీసీ పొలిటికల్ జెఎసి నాయకులు వివి గౌడ్, అంజన్న యాదవ్, దేవర శివ, రమేష్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు అంబటి రమేష్, మద్దిలేటి, వెంకటన్న, హరిజన్ రత్నయ్య, మహేష్ యాదవ్, శ్రీనివాస్ రెడ్డి, బోడి కృష్ణ, భూపని మన్యం, కొండ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News