Tuesday, February 10, 2026
Homeరంగారెడ్డిCPI | భీమ్ రావ్ అంబేద్కర్ గారికి ఘన నివాళులు

CPI | భీమ్ రావ్ అంబేద్కర్ గారికి ఘన నివాళులు

సమ సమాజ నిర్మాణానికి పునాది భారత రాజ్యాంగ అమలు చేయటమే ఏకైక మార్గం గా భారత జాతి ప్రజలు అర్ధం చేసుకోవాలని సిపిఐ రాష్ట్ర నాయకులు ఆందోజు రవీంద్ర చారీ, ముత్యాల యాదిరెడ్డి లు అన్నారు, డా ” బిఆర్ “అంబేద్కర్ గారి 69 వ వర్ధంతి సందర్బంగా అబ్దుల్లాపూర్ మెట్టు మండల పార్టీ కార్యదర్శి అజ్మీర్ హరిసింగ్ నాయక్ ఆధ్వర్యంలో రావి నారాయణ రెడ్డి ఫేస్ -3 భూ పోరాట కేంద్రంలో ఏర్పాటు చేశారు కార్యక్రమం లో అంబేద్కర్ విగ్రహనీకి, చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు.

ఆయన సేవలు, త్యాగాలు కొనియాడారు, అంబేద్కర్ అందరి మనిషి, నిజమైన భారతీయుడి గా అభివర్ణించారు, కుల నిర్మూలన కై ఉద్యమం చేసిన ఉద్యమ నిర్మాణకుడు గా, మహాద్ చెరువు పోరాటం ద్వారా మంచి నీళ్లు ఇచ్చిన మహా త్యాగీ అయ్యాడని గుర్తు చేశారు, స్వేచ్చ, సమానత్వం, సౌబ్రాతత్వం కోసం పరితపించే మానవతావాది గా కొనియాడారు, అణగారిన వర్గాల ప్రజలకు సకల సౌకర్యాలు, రాజ్యాధికారంమే ఆయనకు నిజమైన నివాళిగాపిలుపునిచ్చారు,ఈ కార్యక్రమం లో జిల్లా కార్యవర్గ సభ్యులు సామిడి శేఖర్ రెడ్డి, పబ్బతి లక్ష్మణ్,అరుణ, శ్రీదేవి శేఖర్ యాదగిరి మధు,శోభన్ నిరంజన్, మంగళపల్లి రవి, లాలప్ప, వీరేష్, సుజాత, అరుణ, సరిత,నీలా, పాల్గొన్నారు

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES

Latest News