- సమస్య ఆత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి.
- డి సి ఆర్ బి డిఎస్పి బాలాజీ నాయక్..
గ్రామపంచాయతీ ఎన్నికల్లో వంగపరిచే ప్రయత్నం ఏవైనా కఠినమైన చర్యలు ఉంటాయని డి సి ఆర్ బి డిఎస్పి బాలాజీ నాయక్ హెచ్చరించారు. శుక్రవారం మదనాపురం మండలం అజ్జకోలు, కొత్తపల్లి, దుప్పల్లి తాండ, కొన్నూరు తాండ గ్రామాల్లో భద్రతా పరిస్థితులపై ఆయన ఆరా తీశారు. ఈ సందర్భంగా బాలాజీ నాయక్ మాట్లాడుతూ..

సమస్యత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేసి పోలింగ్ కేంద్రాల వద్ద బి ఎన్ ఎస్ ఎస్ 163 యాక్ట్ (144 సెక్షన్) అమలులో ఉంటుందని ఎన్నికల నియమాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజలు ఎన్నికల సమయంలో పోలీసు వారికి సహకరించి, భయపడకుండా, ప్రలోభాలకు లొంగకుండా స్వతంత్రంగా ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మదనాపూర్ ఎస్సై శేఖర్ రెడ్డి, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
